మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలి

Sun,May 19, 2019 12:48 AM

వాంకిడి: గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా చూడాలని ఏపీడీ వెంకట్ గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ, ఇందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి మరుగుదొడ్డి నిర్మాణంపై అవగాహన కల్పించి, నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ఉన్న పనులకు ముందు పూర్తి చేయాలని, ఇప్పటి వరకు చేపట్టినవి వెంటనే పనులు ప్రారంభించి ఈ నెల 30వ తేదీలోపు మండలానికి ఇచ్చిన వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు ఖర్డి గ్రామంలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మించుకొని పక్షంలో రేషన్, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో మహేందర్, రమకృష్ణ, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles