సింగరేణిలో డోర్లి-1 ఓసీపీకి ప్రత్యేక గుర్తింపు

Sat,May 18, 2019 12:45 AM

రెబ్బెన : సింగరేణిలో డోర్లి-1 ఓసీపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య సూచించారు. బెల్లంపల్లి ఏరియా లోని డోర్లి-1 ఓసీపీ ఈ సంవత్సరం మూతపడడంతో గనిలోని పరికరాలు తరలింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఏరియా జీఎం కొండయ్య సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం కొండయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి-1 ఓసీపీ ప్రతి సంవత్సరం నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు అత్యధిక లాభాలు సాధించిన గనిగా గుర్తింపు సొంతం చేసుకుందన్నారు. మూతపడడంతో సామగ్రి తీసే పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదటిసారిగా డోర్లి-1 ఓసీపీ పర్యటనకు రావడంతో జీఎం కొండయ్యను గని అధికారులు శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి పురుషోత్తంరెడ్డి, కైర్‌గూడ మేనేజర్ ఉమాకాంత్, ఇన్‌చార్జి మేనేజర్ నారాయణ, సంక్షేమాధికారి వేణు, డిప్యూటీ మేనేజర్లు సునీల్, మహేందర్‌రెడ్డి, ఇంజినీర్లు తేజ, సేప్టీ ఓవర్‌మెన్ శ్రీనివాస్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles