మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం తగదు

Sat,May 18, 2019 12:45 AM

బెజ్జూర్ : హరిత హారంలో భాగంగా ఉపాధిహామీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న నర్సరీల్లో మొక్కల పెంపకం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర హరితహారం పరిశీలకుడు కిషన్ అన్నారు. శుక్రవారం ఆయన ఉపాధిహా మీ పథకంలో కుకుడ, బారెగూడ, ఊట్సారంగపల్లి , మర్తిడి, బెజ్జూర్ తదితర గ్రామాల్లోని 12 నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూహరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందకు నర్సరీల్లో అన్నిరకాల మొక్కలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులతో పాటు నర్సరీల నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యలయాతో పాటు రోడ్లకిరువైపులా, పొలాల గట్లపై, తదితర స్థలాల్లో భారీగా మొక్కలు నాటేందకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులకు, ప్రజలకు అన్నిరంగాల వారికి అన్ని రాశుల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బెజ్జూర్, మర్తిడి నర్సరీల్లో మొక్కలు ఎదుగుదల, సిబ్బంది పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజుల్లో అన్ని సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. లేకుంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత అధికారులు సర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈజీఎస్ ఏపీఓ షాకీర్ ఉస్మాని, నర్సరీల నిర్వాహకులు, ఈజీ ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles