సంప్రదాయరీతిలో పెర్సాపేన్‌కు పూజలు

Sat,May 18, 2019 12:45 AM

కెరమెరి: మండలంలోని గిరిజన గ్రామా ల్లో పెర్సాపేన్ ఉత్సవాలు గిరిజన గ్రామాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. మండుతు న్న ఎండల్లోనూ సంప్రదాయ రీతిలో పూజ లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హట్టి గ్రా మంలో మెసెల్కర్ మడావి వంశీయులు భ క్తి శ్రద్ధ్దలతో పెర్సాపేన్ ఉత్సవాలను నిర్వ హించారు. దేవుని మండపం వద్ద సామూహిక పూజలు నిర్వహించి సంప్రదాయ వా యిద్యాలతో పెర్సాపేన్‌ను ఊరేగించారు. ఈ సందర్భంగా పేర్సాపేన్ గ్రామంలోకి రా గానే మహిళలు హారతులతో ఎదురుగా వ చ్చి పూజలు చేయగా, మడావి వంశీయు లు పెర్సాపేన్‌కు జలాభిషేకం చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి కొత్తకోడళ్లతో భే టింగ్(పరిచయం) కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకుయేటా పుష్య, భావై నెలలో జరుపుకోవడం ఆనవాయితీగా వ స్తోంది. ఈ కార్యక్రమంలో కటోడ మడవి లక్ష్మన్, పటేల్ మడవి దంబీ, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మడవి రఘునాథ్, ప్రధాన కార్యదర్శి మడవి జంగుతో పాటు తెలంగాణ, మహారాష్ట్రల నుండి మెసెల్కర్ మడవి వంశీయులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles