మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Sat,May 18, 2019 12:44 AM

రెబ్బెన: నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అడిషనల్ సీసీఎఫ్ డోబ్రియాల్ సూచించారు. మండల కేంద్రంలోని నర్సరీని శుక్రవారం పరిశీలించి, ని ర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభమయ్యే లోగా అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉండాలని సూచించారు. పనికి వచ్చే మొక్కలను పెంచాలనీ, పిచ్చి మొక్కలను తొలగిం చాలన్నారు. మొక్కల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాల నీ, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. నర్సరీలో ఎలాంటి మొక్కలు, ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారని ఆరా తీశారు. మొక్కల పెరుగుదల కొసం జీవామృ తం వాడాలని సూచించారు. ఎండ నుంచి మొక్కల రక్షణకు చర్యలు తీసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సీఎఫ్ సీపీ వినోద్‌కుమార్, ఆసిఫాబాద్ డీఎఫ్‌ఓ రంజిత్‌నాయక్, మంచిర్యాల డీఎఫ్‌ఓ శివాణిడోంగ్రె, రెబ్బెన ఎఫ్‌ఆర్వో అప్పలకొండ, డి ప్యూటీ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ ఉన్నారు.
జైనూర్: నర్సరీల్లో ఉన్న మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఏపీసీసీఎఫ్ డోబ్రియల్ అన్నారు. శుక్రవారం మండలంలోని సంభాజిగూడా నర్సరీని తనిఖీ చేశారు. మొక్కల ను పరిశీలించారు. పెంచుతున్న మొక్కలను అడి గి తెలుసుకున్నారు. ఎండల ప్రభావం పెరుగుతున్నందున మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నా రు. జీవామృతం అమలు తీరును పరిశీలించి అటవీ శాఖ సిబ్బందిని ప్రశంసించారు. సీఎఫ్ వి నోద్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో ని జాముద్దీన్, ఎఫ్‌ఎస్‌వో ప్రియంకా చౌహాన్ ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles