పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Fri,May 17, 2019 01:30 AM

-అప్రమత్తతతోనే రోగాలు దూరం
-ప్రజలకు వైద్య సిబ్బంది సూచన
-‘జాతీయ డెంగీ దినోత్సవం’ సందర్భంగా ర్యాలీలు
కాగజ్‌నగర్‌ రూరల్‌: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వైద్యురా లు విద్యావతి సూచించారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక వైద్య సిబ్బంది పట్టణంలోని పీహెచ్‌సీ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అప్రమత్తంగా ఉంటేనే రోగాలు దరిచేరవనీ, ముఖ్యంగా పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జ్వరం లక్షణాలు ఉంటే, వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించాలన్నారు. వైద్యులు సతీశ్‌, యూనిట్‌హెడ్‌ అనీసుద్దీన్‌, ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
బెజ్జూర్‌: డెంగీపై సరైన అవగాహన ఉంటేనే వ్యాధి నివారణ సులువవుతుందని వైద్యాధికారి రుషి అన్నారు. గురువారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ఆయన సిబ్బందితో కలి సి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగీ మొదటి దశలోనే సరైన చికిత్స తీసుకుంటే మేలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెచ్‌వీ రేణుకా దేవి, ఏఎన్‌ఎంలు మేఘన, మంజుల, సునీత, బుజ్జి పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్‌: ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని సీహెచ్‌ఓ కరుణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ డెంగీ దినోత్స వం సందర్భంగా అవగాహన ర్యాలీ తీశారు. ఫ్రై డేను పాటిద్దాం.. దోమలను కుట్టకుండా అరికడ దాం అని అవగాహన కల్పించారు. డెంగ్యూ లక్ష ణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ల్యాబ్‌టెక్నిషియన్‌ శ్రీనివాస్‌, ఫార్మసిస్టు ఎన్‌ఎస్‌ రెడ్డి, ఏఎన్‌ఎం విజయ, శిరీష, సావిత్రి, భా గ్య, శారద, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles