జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Fri,May 17, 2019 01:30 AM

-సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తా
-జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కోవ లక్ష్మి
-ఎంపీడీవో చేతుల మీదుగా జైనూర్‌ జడ్పీటీసీకి ఏకగ్రీవ ఎన్నిక ధ్రువీకరణ పత్రం
-టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు
-జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం
జైనూర్‌: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాజీ ఎమ్మెల్యే, జడ్పీచైర్‌పర్సన్‌ అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దత్తారాం జైనూర్‌ జడ్పీటీసీ ఏకగ్రీవ ఎన్నిక పత్రాన్ని కోవ లక్ష్మికి అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నిక పత్రాలు అందుకోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు పటాకలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీగా కోవలక్ష్మి నివాసానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గతంలో పని చేసిన అనుభవం ఉందనీ, నియోజక వర్గంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలున్నాయనే విషయంపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. సమస్యలు పరిష్కరించి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. సీనియర్‌ నాయకులు సయ్యద్‌ అబుతాలిబ్‌ గిరిజన ప్రాంత సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరగా ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జైనూర్‌ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కోవలక్ష్మిని నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ మాజీ సర్పంచ్‌ మర్సుకోల సరస్వతి, జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవరావ్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, అబుతాలిబ్‌, సహకార సంఘం చైర్మన్‌ జాహేద్‌ఖాన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కుమ్ర భగవంత్‌రావ్‌, నాయకులు చిర్లె లక్ష్మణ్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ రషీద్‌, హన్నుపటేల్‌, సర్పంచులు మడావి భీంరావ్‌, పార్వతీబాయి లక్ష్మణ్‌, మోతుబాయి మాధవ్‌రావ్‌, నాయకులు ఫేరోజ్‌ఖాన్‌, షేక్‌ అబ్బు, అజ్జులాల, సయ్యద్‌ జావిద్‌, జాకీర్‌, కోడప ప్రకాశ్‌, లట్పటే మహాదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles