డెంగీపై అప్రమత్తంగా ఉండాలి

Fri,May 17, 2019 01:29 AM

-పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు
-జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
-జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ
ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : డెంగీ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన ర్యాలీ తీశారు. ప్రభుత్వ ప్రభుత్వ దవాఖాన నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎడిస్‌ అనే దోమ కాటు వల్ల డెంగీ వస్తుందన్నారు. వైరస్‌ వల్ల వచ్చే జ్వరాలు చాలా ప్రమాదకరమన్నారు. పూర్తి చికిత్స లభ్యంకాదనీ, లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎడాది జిల్లాలో 23 డెంగీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. డెంగీ వ్యాధిగ్రస్తులంతా కరీంనగర్‌, మహారాష్ట్ర ప్రాంతాల్లో పనిచేసేవారన్నారు. అక్కడి నుంచి జ్వరంతో ఇక్కడికి వచ్చారని తెలిపారు. వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు తమ బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో సుధాకర్‌ నాయక్‌, వైద్యాధికారి సత్యనారాయణ, సిబ్బంది సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, శ్యాంలాల్‌, రాధిక, రాజేశ్వరి, రషిద్‌, భీమన్న తదితరులున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles