ఓట్ల లెక్కింపు పారదర్శంగా ఉండాలి

Fri,May 17, 2019 01:29 AM

-సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలి
-సువిధ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి
-కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం కౌటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ మైక్రో అబ్జర్వర్లు, తాసిల్దార్లకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో జరిగిన పోలింగ్‌ ఓట్ల లెక్కింపును ఈ నెల 23న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లెక్కింపు సిబ్బంది 22న ఆదిలాబాద్‌లో ఉదయం 11 గంటలకు రిపోర్ట్‌ చేయాలన్నారు. ఇంకోసారి సిబ్బందికి ఆదిలాబాద్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఓట్ల లెక్కింపునకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేయాలనీ, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. ప్రతి రౌండ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు వివరాలను సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకార్యాలు సమకూర్చుకోవాలనీ, కౌటింగ్‌ సిబ్బంది సకాలంలో హాజరుకావాలన్నారు. అనంతరం కౌటింగ్‌ సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్వాదేవరాజన్‌ తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో ఆర్డీఓలు సిడాం దత్తు, శివకుమార్‌, డిప్యూటీ తాసిల్దార్‌ జితేందర్‌, తదితరులు పాల్గొన్నారు

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles