బాక్సుల్లో భవితవ్యం..!

Thu,May 16, 2019 01:26 AM

-ముగిసిన ప్రాదేశిక ఎన్నికలు
-పరిషత్‌ బరిలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు
-14 జడ్పీటీసీ స్థానాల్లో 75..
-123 ఎంపీటీసీ స్థానాల్లో 454 మంది
-పడిన ఓట్ల లెక్కల్లో శ్రేణుల తలమునకలు
-27న వెలువడనున్న ఫలితాలు
ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు ఉండడంతో అప్పటి వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థులు వేచి చూడాల్సిందే. మొదటి విడతలో సిర్పూర్‌ టి నియోజవర్గంలోని చింతలమానెపల్లి, సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూర్‌, పెంచికల్‌ పేట్‌ మండలాల్లో ఎన్నికలు ఈ నెల 6న నిర్వహించారు. ఆరు మండలాలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో సిర్పూర్‌(టి)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. 10న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్‌ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడతలో ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని మిగితా ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ బ్యాలెట్‌ బాక్సులను ఆసిఫాబాద్‌లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించారు.

మొదటి విడతలో....
ఈ నెల 6న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కౌటాల మండలంలో 24,221 మంది ఓటర్లు ఉండగా 19,257 మంది, చింతలమానెపల్లిలో 21,280 మంది ఓటర్లకు, 17,106, పెంచికల్‌ పేట్‌లో 11,039 మందికి 9,595 మంది, సిర్పూర్‌(టి)లో 19,803 మందికి 15, 584 మంది బెజ్జూర్‌లో19, 385మందికి 15,515. దహెగాంలో 20,316 మంది ఓటర్లకు 17,095 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రెండో విడతలో..
ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో కాగజ్‌నగర్‌ మండలంలో 38,716కు 29,202 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఆసిఫాబాద్‌లో 24891కి 19416 ఓట్లు పోల్‌ అయ్యాయి. రెబ్బెనలో 26130కి 19950 ఓట్లు పోల్‌ అయ్యాయి.తిర్యాణిలో 15862కు 11833 ఓట్లు పోల్‌ అయ్యాయి.
మూడో విడతలో...
మంగళవారం నిర్వహించిన మూడో విడత ఎన్నికల్లో కెరమెరి మండలంలో 20,594 ఓటర్లుండగా 15,099 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాంకిడిలో 24,478 మంది ఓటర్లు ఉండగా 18,911 మంది ఓటు వేశారు. జైనూర్‌లో 20,390 మంది ఓటర్లు ఉండగా 14,857 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిర్పూర్‌(యు)లో 10,274 మందికి 8,205 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. లింగాపూర్‌లో 8,990 మందికి 7,021 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అభ్యర్థుల్లో ఉత్కంఠ
జిల్లాలో పరిషత్‌ పోరు సంగ్రామం ముగిసింది. ఇక ఫలితాలపైనే అందరి దృష్టి పడింది. ఫలితాలకు మరో పదకొండు రోజుల గడువు ఉండడంతో, ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రచారంలో భాగంగా ఎండలను కూడా లెక్కచేయకుండా ఊరూవాడా తిరిగి, ఓటర్లను కలిసిన అభ్యర్థులు పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో, ఇక ఓట్ల లెక్కలు వేస్తున్నారు. తమకు పడిన ఓట్లు సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో జైనూర్‌ జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 14 జడ్పీటీసీ స్థానాల్లో 75 మంది బరిలో ఉన్నారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో 454 మంది బరిలో నిలిచారు. వీరిలో ప్రజలు మెచ్చిన నాయకులెవరో తేలాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles