ఫసల్‌ బీమా.. రైతుకు ధీమా

Thu,May 16, 2019 01:25 AM

-జిల్లాలో వరి, పత్తి, మామిడి, ఇతర ఆహార పంటలకు వర్తింపు
-ప్రీమియం చెల్లింపునకు గడువు ప్రకటించిన ప్రభుత్వం
-పత్తికి వాతావరణ ఆధారిత..
-సోయాకు గ్రామ, ఇతర పంటలకు మండల యూనిట్‌గా అమలు
పంట గడువు
వరి ఆగస్టు 31
పత్తి జూలై 31
ఇతర పంటలు జూలై 15
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునేందుకు వీ లుగా ‘పంటల భీమా పథకం’ మార్గదర్శకాలను ప్ర భుత్వం జారీ చేసింది. ఈ మేరకు పంటల వారీగా రైతులు చెల్లించే ప్రీమియంను ఖరారు చేసింది. జిల్లాను క్లస్టర్‌1లో చేర్చిన ప్రభుత్వం, రైతులు ప్రధానంగా పండించే వరి, పత్తి, మామిడితోపాటు ఇతర ఆహార పంటలకు బీమా వసతి కల్పించింది. గతంలో మాదిరిగానే జిల్లాలో వరి, పత్తి పంటకు వాతావరణాధారిత బీమా గ్రామం యూనిట్‌గా వర్తింపజేయనున్నారు. మిగిలిన పంటల్లో జొన్న, కంది, పెసర మినుములు తదితర పంటలకు మండలం యూనిట్‌గా పంటల బీమా అమలు చే యనున్నారు. పత్తి పంటలకు ప్రీమియం చెల్లింపు గడువును జూలై 15 వరకు, సోయా, ఇతర పంటలకు జూలై 31 లోగా, వరికి ఆగస్టు 31 వరకు ప్రీమి యం చెల్లించాలని గడువు నిర్ణయించారు.
ఆసిఫాబాద్‌ జిల్లాలో సుమారు లక్షా 35 వేల హె క్టార్ల సాగు భూమి ఉండగా, దాదాపు 97 వేల మం ది రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయా పంటలను సాగు చేస్తున్నారు. రైతులు ప్రతి ఏడాది ఏదో ఒక రకంగా పంటలను నష్టపోతున్నా రు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీ మా పథకం అమలు చేస్తున్నాయి. బ్యాంకు నుంచి రుణం పొందే రైతులు పంట బీమా ప్రీమియం త ప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం పొందని రైతులు నేరుగా ప్రీమియం సంబంధిత కంపెనీలకు చెల్లించి బీమా చేసుకోవడానికి వీలుంటుంది.

పత్తికి వాతావరణాధారిత బీమా..
జిల్లాలో పత్తిని రైతులు వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. అతివృష్టి లేదా అనావృష్టితో పత్తి దిగుబడి రాక, రైతులు తీవ్రంగా నష్టబోతున్నారు. దీం తో ప్రభత్వుం పత్తికి దిగుబడులతో సంబంధం లే కుండా వాతావరణ ఆధారిత బీమాను వర్తింపజేసేందుకు నిర్ణయించింది. వాతావరణంలో కలిగే మార్పులతో పంటలు నష్టపోతే సంబంధిత కంపెనీ నుంచి పరిహారం పొందే అవకాశం ఉటుంది. జిల్లా లో దాదాపు 60 శాతం పత్తి పంటనే సాగవుతోంది. వచ్చే వానాకాలంలో 75 నుంచి 80 వేల హెక్టార్లలో పత్తి పంట సాగుచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పంట నష్టపోయిన సందర్భంలో ఎకరాకు రూ. 35 వేలు బీమా పరిహారంగా వస్తున్నది. బీమా మొత్తానికి 30 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ధరలో 25 శాతం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బరిస్తుండగా, రైతులు ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం పత్తి, వరి, సోయా, సాగు చేసే రైతులు రూ. 680 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లింపు గడువును జూలై 15 వరకు నిర్ణయించారు. పత్తి పంటకు బీమా చేసుకునే రైతులు గడువులోగా ప్రీమియం చెల్లిస్తే బీమా పరిధిలోకి వస్తారు. జిల్లా లో ఐఎఫ్‌ఎఫ్‌సీఓ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

గ్రామం యూనిట్‌గా..
సోయా పంటకు గ్రామం యూనిట్‌గా బీమా అ మలు చేయనున్నారు. జిల్లాలో పత్తి తరువాత అధి క విస్తీర్ణంలో సోయానే రైతులు సాగుచేస్తున్నారు. పంటలో వచ్చిన దిగుబడుల ఆధారంగా ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం వస్తుంది. ఈ మేరకు జిల్లాలో సోయ సాగు చేసే ప్రాంతాలను యూనిట్‌ గా లెక్కించి దిగుబడులను అంచనా వేస్తారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి యూనిట్లు ఏర్పాటు చేసి పంట కోత ప్రయోగాలను నిర్వహిస్తారు. వీటి ద్వారా ఆయా గ్రామాల్లో వచ్చిన దిగుబడులను లెక్కిస్తారు. పంట కోత ప్రయోగాల్లో సగటు దిగుబడుల కంటే తక్కువ దిగుబడులు వస్తేనే పరిహారం వచ్చే వీలుంటుంది. జూలై 31 లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర పంటలకు మండలం యూనిట్‌గా..
జిల్లాలో పత్తి, సోయా పంటలతోపాటు ఇతర అనేక పంటలను రైతులు సాగుచేస్తున్నారు. కందు లు, పెసర, మినుములు, జొన్న తదితర పంటలకు మండలం యూనిట్‌గా బీమా అమలు చేయనున్నారు. పంటల వారీగా ప్రీమియం వేర్వేరుగా ఉం టుంది. బ్యాంకులలో రుణం తీసుకునే రైతులు నేరు గా బీమా చేసుకునే వీలుంది. రైతులు జూలై 31 వ తేదీ గడువులోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుం ది. కందులు, మినుములకు రూ.280, పెసర్లకు రూ. 300, జొన్నకు రూ. 360 ప్రీమియంగా నిర్ణయించారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles