జూన్‌ లోగా పూర్తి చేయాలి

Thu,May 16, 2019 01:21 AM

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: మరుగుదొడ్ల నిర్మాణ పనులు జూన్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీవో, కార్యదర్శులు, ఏపీవో, ఏపీఎంలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అధి కారులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని అన్ని మండలాల్లో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఒక బృందం ఉదయం బెజ్జుర్‌, కౌట ల, సిర్పూర్‌(టి), తిర్యాణి, కాగజ్‌నగర్‌, దహెగాం. రెండో బృందం సిర్పూర్‌(యు), కెరమెరి, జైనూర్‌, ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి మండలాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జీపీలవారీగా కార్యదర్శులు పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని చె ప్పారు. ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటికీ మ రుగుదొడ్డి నిర్మాణం జరిగేలా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తూనే, ప్రారంభం కాని వాటిపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులపై వివరాల డిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో పనులకు ఆ టంకం కలగకుండా సరిపడా సామగ్రి నిల్వ ఉంచు కోవాలన్నారు. డీపీవో గంగాధర్‌గౌడ్‌, డీఆర్డివో పీడీ వెంకట్‌ శైలేశ్‌, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీవో లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles