మాజీ ఎంపీపీ మృతి

Thu,May 16, 2019 01:21 AM

కెరమెరి: మాజీ ఎంపీపీ మాచర్ల గణేశ్‌ (38) అనారోగ్యంతో మంగళవా రం రాత్రి మృతి చెం దారు. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాపూర్‌ గ్రామానికి చెందిన గణేశ్‌ కొంత కాలం గా అనారోగ్యంతో బా ధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న పరిస్థితి విషమించడంతో స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో సుధాకర్‌నాయక్‌, వైద్యాధికారి సుంకన్న పరీక్షించి మెరుగైన వైద్యం కో సం రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు స్కానింగ్‌ తీయగా తలలో రక్తం గడ్డకట్టి ఉన్న ట్లు గుర్తించి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు రెఫర్‌ చేశారు. అక్కడ వైద్యం పొందుతూ మంగళవారం రాత్రి 2.30 గంటలకు మృతి చెందాడు. మాజీ జడ్పీటీసీ అబూల్‌ కలాం, మాజీ ఉపాధ్యక్షుడు రాథోడ్‌ గోవింద్‌నాయక్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు షేక్‌ యూనుస్‌, లాల్‌సింగ్‌, మణిరాంతో పలువురు నాయకులు, అధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2014, జూలై 4న నుంచి నాలుగేండ్ల పాటు కెరమెరి ఎంపీపీగా కొనసాగారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles