రైతుల వివరాలు నమోదు చేయాలి

Tue,May 14, 2019 11:36 PM

-జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి
-వ్యవసాయక్షేత్రస్థాయి అధికారులకు సూచన
కౌటాల : సమగ్ర సర్వే ద్వారా సేకరించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ క్షేత్రస్తాయి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి దాకా మండలంలో 90 శాతం రైతుల వివరాలు సేకరించారని, మిగతా రైతుల వివరాలను కూడా పూర్తిచేయాలన్నారు. పట్ట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులకు రైతు బీమా నమోదు చేయాలనీ, రైతులంతా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు బీమా ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతూ వారి వివరాలను సంబంధిత ఏఈవోలకు అందించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా పట్టు మరియు ఉద్యానవన శాఖ అధికారి మెహర్ భాషా, ఇన్‌చార్జి ఏడీఏ రాజులు నాయుడు, కౌటాల, చింతలమానేపల్లి మండలాల వ్యవసాయ అధికారి పాలకుర్తి రాజేశ్, రాజేశ్వర్, రవి, సర్పంచ్ మౌనిష్, తదితరులున్నారు.

సర్వేను సద్వినియోగం చేసుకోవాలి..
కాగజ్‌నగర్ రూరల్ : మండలంలోని రాస్పెల్లిలో మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు సమగ్ర సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల సాగు విస్తీర్ణం, భూమి స్వభావం, పంట రకాలు తెలుసుకునేందుకు 39 అంశాలతో కూడిన సమచారాన్ని అందజేయాలన్నారు. గ్రామాలకు వచ్చిన ఏఈవోలకు రైతులు సహకరించి, తమ వివరాలను అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి ఏఈవోలు సంబంధిత వివరాలతో పాటు ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌ను తీసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్, ఏవో రామకృష్ణ, ఏఈవోలు సృజన, యువరాణి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles