వైద్య సేవలు మరింత చేరువ

Tue,May 14, 2019 11:35 PM

కాసిపేట : ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా కాసిపేట మండలానికి నాలుగు హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలను మంజూరు చేసింది. వీటి ఏర్పాటుకు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయ పూర్ణియ ప్రభుత్వ భవనాలను మంగళవారం పరిశీలించారు. ముత్యంపల్లి, పల్లంగూడ, ధర్మారావుపేట, దేవాపూర్‌కు హెల్త్, వెల్‌నెస్ సెంటర్లు మంజూరు కాగా ఆయా గ్రామాల్లోని సబ్ సెంటర్ల భవనాలను హెల్త్, వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయా లేవా సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే వివరాలు సేకరించారు. ముత్యంపల్లి సబ్ సెంటర్ పీహెచ్‌సీకి దగ్గరగా ఉండడంతో ముత్యంపల్లి కేంద్రాన్ని గట్రావ్‌పల్లిలో ఏర్పాటు చేస్తే గిరిజనులకు సేవలు అందుతాయనే అభిప్రాయం ఉందని, సెంటర్‌ను మార్చేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు విజయ పూర్ణిమ వివరించారు. గట్రావ్‌పల్లి సబ్ సెంటర్ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉందని, భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా పరిశీలిస్తున్నామన్నారు. హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలతో ఆయా గ్రామాల్లో మినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా భావించ వచ్చన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందాల్సిన అవసరం లేదని, కేంద్రాలను ఏర్పాటు చేస్తే దగ్గరలోనే వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఈ కేంద్రాలతో వైద్య సేవలతో పాటు ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి అక్కడే వైద్య సేవలు అందించడం, యోగా, మెడిటేషన్ తదితర అంశాలతో ఆరోగ్యవంతులుగా చేసేందుకు కేంద్రాలు ఉపయోగపడుతాయన్నారు. హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలు మంజూరు కాగా ఏర్పాటుపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వివరించారు. ఆమె వెంట హెచ్‌ఈఓ సత్యనారాయణ, హెచ్‌వీ కమల, సిబ్బంది ఉన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles