మెరుగైన పరిహారం అందిస్తాం

Tue,May 14, 2019 11:35 PM

తాండూర్ : అబ్బాపూర్ గ్రామ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించి అందరికీ న్యాయం చేస్తామని, మెరుగైన పరిహారం అందిస్తామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బీపీఏ ఓసీపీ-2 ఎక్స్‌టెన్సన్ పరిధి అబ్బాపూర్ గ్రామస్తులకు పునరావాసం (ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ) విషయమై మంగళవారం గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ రాజ్ అబ్బాపూర్‌లో ఇళ్లు కోల్పోతున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదటి నుంచి నివాసం ఉంటున్న 60 కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో కొందరు నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేయగా రెవెన్యూ సిబ్బందితో మళ్లీ సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంటికి, ఇంటి వద్ద ఉన్న భూమికి వేర్వేరుగా విలువ కట్టి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సింగరేణి నుంచి అందుతుందని గ్రామస్తులకు వివరించారు. అబ్బాపూర్ వాసులు ఏర్పాటు చేసుకునే నూతన పునరావాస నివాసాల వద్ద సింగరేణి ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో అన్ని అభివృద్ధి పనులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రైబల్ సొసైటీలు నమోదు చేయించుకునేలా గ్రామస్తులను ప్రోత్సహించి, వారికి టెండర్లలో అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాల కాంట్రాక్టుల్లోనూ నిర్వాసితులకు ప్రాధాన్యత ఇప్పించేలా చూస్తామని తెలిపారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కోసం సింగరేణి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఆర్‌ఐ ప్రభులింగం, వీఆర్వో గణపతి, ఎంపీటీసీ సిరంగి శంకర్, సర్పంచ్ జంగుబాయి, సింగరేణి అధికారులు ఎస్‌వోటూజీఎం సాయిబాబా, ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి, ఏరియా సర్వే ఆఫీసర్ రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, బీపీఏ ఓసీపీ-2 మేనేజర్ ప్రవీణ ఫటింగ్, సంక్షేమాధికారి శ్రీకాంత్, ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles