మాతా, శిశు మరణాలను అరికట్టాలి

Tue,May 14, 2019 04:46 AM

-గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
-రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు ఇవ్వాలి
-సర్కారు దవాఖానల్లోనే ప్రసవాలు చేయించాలి
-జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు
ఆసిఫాబాద్ టౌన్: జిల్లాలో మాతాశిశు మరణాలు అ రికట్టే బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని డీఎంహెచ్‌వో కు మ్రం బాలు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాతా శిశుమరణాలపై సోమవారం ఏర్పాటు చే సిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిశోర బా లికల స్థాయి నుంచే మాతృమరణాలపై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు రక్తహీనత రాకుండా చూడాలన్నారు.

గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, పోషణ సేవలను అందించాలని ఆదేశించారు. రక్తహీనత నివారణ కోసం కనీసం ఐరన్ మాత్రలు వేసుకునే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ద వాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. తోపాటు ప్రభుత్వం సమకూర్చిన 102, 108 అంబులెన్స్‌లను వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశం లో డిప్యూటీ డీఎంహెచ్‌వో సునీల్‌రావ్, గైనకాలజిస్ట్ జ యశ్రీ, వైద్య సిబ్బంది తదితరులున్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles