బాధితులకు న్యాయం జరగాలి

Sun,May 12, 2019 12:50 AM

-కోర్టు కానిస్టేబుల్ బాధ్యత కీలకమైనది
-రుజువులు, సాక్ష్యాలు పక్కాగా ఉండాలి
-పోలీసుల సమీక్షలో ఎస్పీ మల్లారెడ్డి
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : నేరం చేసిన వారు ఎంతటివారైన శిక్ష పడేలా చూసి బాధితులకు న్యా యం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. శనివా రం ఏఆర్‌హెడ్ క్వార్టర్‌లోని సమావేశ మందిరం లో కోర్టులో పెండింగ్ ఉన్న ట్రయల్ కేసులపై స మీక్షించారు. విధుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని ఆడిగి తెలుసుకున్నా రు. అనంతరం మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుల్ బా ధ్యత చాలా కీలకమైదని, జిల్లాను నేర రహిత స మాజంగా తీర్చిదిద్దాలంటే శ్రమించాలన్నారు. ఇం దుకోసం ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్త య్యే వరకు నేరాన్ని నిరూపించేందుకు అవసరమై న రుజువులు, పత్రాలు, సాక్షులు వాగ్మూలం కోర్టుకు సమర్పించడంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కోర్టులో సరైన సమయం లో ఎఫ్‌ఐఆర్‌లను అందించాలన్నారు. నేరస్తులకు వారెంట్స్, సమన్లు, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అ య్యేలా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు. కోర్టు క్యాలెండర్ వెంట వెంటనే అప్డెట్ చేసి సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కోర్టు మానిటర్ సిస్టంలో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. దీనిద్వారా ప్రతి రోజు కోర్టు ప్రాసెస్ ఎలా జరుగుతుందనీ వెంటనే ఆన్‌లైన్‌లో తెలుస్తుందన్నారు. ప్రతి రోజు కోర్టులో ట్రయల్ జరిగిన కేసు లు ఎంటర్ చేస్తే పెండింగ్ లేకుండా ఉంటుందన్నారు. ఏఎస్పీ గోధ్రు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐ ఆడ్మిన్ శేఖర్‌బాబు, సీసీ మనోజ్, కోర్టు మానిటరింగ్ ఆఫీసర్లు ఏఎస్‌ఐ చంద్ర మిస్త్రీ, హెచ్ సీ రవీందర్, సభ్యులు, ఐటీ కోర్ టీం సభ్యులు, పీఆర్‌ఓ శ్రవన్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles