ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

Sun,May 12, 2019 12:49 AM

-పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలి
-సమీక్షలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మూడో విడత పరిషత్ ఎన్నికలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూడో విడతలో జైనూర్, కెరమెరి, సిర్పూర్(యు), లింగాపూర్, వాంకిడి మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎండల తీవ్రత పెరిగినందున తాగునీరు, మెడికల్ కిట్, దివ్యాంగులకు వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మండలాల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారికి ఉదయం 6 గంటల నుంచి వాహన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బంది సకాలంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లైజన్ ఆధికారి శైలేష్, ఎంపీడీఓలు, తాసిల్దార్లు, జోనల్ అధికారులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles