ఓటెత్తిన పల్లె జనం

Sun,May 12, 2019 12:49 AM

-మండుటెండలను కూడా లెక్కచేయని పల్లె ఓటర్లు
-పెద్ద సంఖ్యలో తరలివచ్చిఓటేసిన ప్రజలు
-మొదటి విడతలో 80.82 శాతం
-రెండో విడుతలో 76.14 శాతం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పో లిస్తే ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఓటు హక్కు వినియోగంలో తమ చైతన్యాన్ని మరిం త చాటుకుంటున్నారు. జిల్లాలో ఈనెల 6న జరిగిన తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.82 శాతం మం ది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నా రు. మొదటి విడుతలోని ఆరు మండలాలు సిర్పూర్-టి, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలే. మండుతున్న ఎండల కారణంగా పో లిం గ్ శాతం తగ్గవచ్చని భావించినప్పటికీ అందుకు భిన్నంగా గ్రామీణ ఓటర్లు ఎంతో చైతన్యంతో ఎండలను కూడా లెక్కచేయకుండా తమ ఓటు హక్కుని వినియోగించుకొని తమకు నచ్చిన నేతలకు ఓట్లు వేశారు. పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూ డా వరుసల్లో ఓపికగా నిలబడి ఓట్లు వేశారు. మొ దటి విడుతలో 1,16,494 మంది ఓటర్లకు గాను 94152 మంది ఓట్లు వేశారు. జిల్లాలోనే చిన్న మం డలమైన పంచికల్‌పేట్ మండలంలో 86.92 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం.

రెండో విడతలోనూ అదేజోరు..
జిల్లాలో రెండో విడుతలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు తరలివచ్చి, చైతన్యా న్ని చాటుకున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రా మీణ ప్రాంతాల్లోనే పోలైన ఓట్ల శాతం అధికంగా న మోదైంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండో విడతలోని నాలుగు మండలాలు ఆసిఫాబాద్, రెబ్బన, తిర్యా ణి, కాగజ్‌నగర్ మండలాల్లో 1,05,599 మంది ఓటర్లకు గాను 80,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 76.14 నమోదైంది. మొదటి విడతలో పోలైన ఓట్లు

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles