ఆదరిస్తే మరింత అభివృద్ధి

Sun,May 12, 2019 12:48 AM

-ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి
-గిరి గ్రామాల్లో ముమ్మర ప్రచారం
-కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన
సిర్పూర్(యు) : పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం కొడ్డిగూడ, నేట్నూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పా రిపాలన సౌలభ్యం కోసం నూతన మండలాలు, తం డాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందన్నా రు. అంతేగాకుండా మండలాన్ని అన్ని విధా లా అబివృద్ధి చేసిందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీటి సౌకర్యం, రైతు బంధు లాంటి అనేక పథకాలకు అమలు చేస్తుందన్నారు. అంతేగాకుండా వచ్చే జూన్ నుంచి అన్ని వర్గాల రైతులకు సమానంగా రైతుబంధుతో పాటు ఆదివాసీలు జీవనాధారం వ్యవసాయం కావడంతో ప్రతి రైతుకు వ్యవసాయ బావి ఏర్పాటుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్య ర్థి కోవ అరుణ, ఎంపీటీసీ అభ్యర్థి సార్జాబాయి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావ్, మాజీ ఎంపీపీ ఆత్రం భగవంత్‌రావ్, ఇంతియాజ్‌లాలా, కనక సుదర్శన్, అర్క నాగోరావ్, భుజంగ్‌రావ్, కొడప ప్రకాశ్, తొడసం రాజరాం, కు మ్రం భీంరావ్, ఆత్రం జాలీంషావ్ ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles