తిర్యాణి మండలంలో 74.60 శాతం

Fri,May 10, 2019 11:20 PM

తిర్యాణి: మండలంలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 74.60 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 15,862 మంది ఓటర్లకు 6006 మంది పురుషులు, 5827 మంది మహిళలు మొత్తం 11833 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొర్రిగుడలో అత్యధికం 90.48 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా మాణిక్యపూర్‌లో 47.49 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తన స్వగ్రామమైన ఖైరిగూడ, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి భీంజిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు హాజీమ్ తిర్యాణి, రోంపల్లి, మెస్రంగూడలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కాగా ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles