పరిషత్ పోలింగ్ ప్రశాంతం

Fri,May 10, 2019 11:20 PM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: మండలంలో రెండో విడతలో భాగంగా శుక్రవారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 78 శాతం పోలింగ్ నమోదైంది. 10 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మొత్తం 24891 మంది ఓటర్లుండగా పురుషులు 9800, మహిళలు 9616 మొత్తం 19416 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు కూలీలు వెళ్లడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల వరకు పెద్దగా ఓటర్ల తాకిడి కనిపించ లేదు. మరికొన్ని కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటర్లు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి అరిగెల నాగేశ్వర్‌రావు చిర్రకుంటలో, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్ వావుదంలో, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు, గుండి ఎంపీటీసీ అభ్యర్థి గాదెవేణి మల్లేశ్ చిర్రకుంటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను ఎంపీటీడీ రమేశ్‌కుమార్,ఎస్‌హెచ్‌ఓ మల్లయ్య, డీపీవో గంగాధర్‌గౌడ్ పర్యవేక్షించారు. 51 పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా ఏడు రూట్లలో ఏడుగురు జోనల్ ఆధికారు ఎన్నికలను పర్యవేక్షించారు. 228 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఓటర్ల ఇబ్బందులు పడకుండా టెంట్లను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సౌకర్యం కల్పించారు. సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ అనంతరం ఆయా కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రితో స్ట్రాంగ్ రూంకు చేరుకున్నారు. ఎంపీడీవో రమేశ్ పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన సామగ్రిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి సీల్ వేశారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles