టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి

Fri,May 10, 2019 11:20 PM

సిర్పూర్(యు): పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం లింగాపూర్ మండలంలోని ఎల్లపటార్, రాఘపూర్, మోతీగూడ, దంపూర్, కీమనాయక్‌తండా, లొద్దిగూడ, పూల్‌సింగ్‌తాండ, నాగుగూడ, మారుగూడ, గోపల్‌నాయక్‌తండా, లింగాపూర్ గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మండలాన్ని అన్ని విధాల అబివృద్ధి చేసిందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీటి సౌకర్యం, రైతు బంధు లాంటి అనేక పథకాలకు అమలు చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థుల ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈయన వెంట గౌరిబాయి, గణపత్‌నాయక్, అనిల్, ఆత్మారాం, శేఖర్, జై వంత్, బాను, జాదు, శేష్‌నారాయణ, చిరంజీవి ఉన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles