ఎండ @ 42 డిగ్రీలు

Wed,April 24, 2019 11:52 PM

- రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు
- నిర్మానుష్యంగా రహదారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో రోజురోజుకూ ఎండలు దండికొడుతున్నా యి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకుకు చేరింది. ఏప్రిల్‌లోనే ఈ స్థాయిలో ఉంటే మే లో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 10 దాటితే చాలు జనాలు బ యటకు రావాలంటనే జంకుతున్నారు. దీంతో రోడ్ల న్నీ నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. అడవులు అధికంగా ఉన్న జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలం ప్రా రంభంలో వర్షాలు సగటుకంటే ఎక్కువగా కురిసినప్పటికీ ఆ తర్వాత కురువకపోవడంతో ఏప్రిల్‌లో ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కాగా, బుధవారం 43 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్టోగ్రతలు కూడా 24 నుంచి 28 మధ్య నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాకుండా వాగులు, వంకలు, చెరువుల్లోని నీళ్లు ఎండిపోతున్నాయి. ఉపశమనం పొందేందుకు కూలర్లు కొనుగోలు చేస్తున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles