అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

Wed,April 24, 2019 11:51 PM

రెబ్బెన: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని గంగాపూర్ వాగు నుంచి కైర్‌గూడకు నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి లారీలలో తరలిస్తుండగా గ్రామస్తుల సమచారం మేరకు రెబ్బెన ఎస్‌ఐ రమేశ్ ఏపీ 01 డబ్ల్యూ 5932, ఏపీ 01డబ్ల్యూ 5933, టీఎస్ 12 యూబీ 5405 నెంబర్‌లు గల లారీలను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి రెబ్బెన తహసీల్దార్‌కు అప్పగించగా ఒక్కొక్క లారీకి రూ. 10 వేల జరిమాన విధించినట్లు తెలిపా రు. ఎలాంటి అనుమతులు లేకుండ ట్రాక్టర్లు, లారీ లు ద్వారా ఇసుక తరలిస్తే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక తరలించాలన్నారు . ఈ సమావేశంలో రెబ్బెన సీఐ వీవీ రమణమూర్తి, ఎస్‌ఐ రమేశ్ ఉన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles