ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Wed,April 24, 2019 11:51 PM

- సమన్వయంతో ముందుకెళ్లాలి
- ఎన్నికల అబ్జర్వర్ ఎండీ హాజీమ్
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి సిబ్బందితో సమీక్ష

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్ ఎండీ హాజీమ్ సూచించారు. బుధ వారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తుతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా అబ్జర్వర్, కలెక్టర్ మాట్లా డుతూ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లి పోలింగ్ సక్ర మంగా జరిగేలా చూ డాల్సిన అవసరం ఉంద న్నారు. 273 పెద్ద, 473 జంబోతో పాటు అదనంగా ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లను పరిశీ లించారు. అవసరమైన మేరకు మరమతులు పూర్తి చేయాలనీ, రెండో స్థాయి వరకు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అ ధికారులను ఆదేశించారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బంది ఉదయం 11.30 గంటల నుంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి డిస్ట్రి బ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు సా మగ్రిని తరలించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రెసైడింగ్ అధికారులకు మొద టి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రెండో స్థాయి శిక్షణ కార్యక్రమా లు ఇవ్వడం జరు తుందన్నారు. కేటాయించిన పొలింగ్ కేంద్రా లకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాంబాబు, ఎక్స్‌పెండించర్ అధికారి మనోహర్, లైసన్ ఆధికారి వెంకట్ శైలేష్, సీపీవో కృష్ణయ్య, డీటీడీవో దిలీప్, డీపీ వో గంగాధర్‌గౌడ్, డీపీఆర్‌వో తిరుమల, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయ ఏవో అరుణ, విద్యాశాఖ కమిషనర్ ఉదయ్‌బాబు, ఏపీడీ రామకృష్ణ, రాజేశ్వర్ తదితరులున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులు నిర్వహించే ఆధికారులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని లైజన్ ఆఫీసర్ వెంకట్ శైలేష్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులు పాల్గొనే వారు ఈ నెల 27లోగా ఆసిఫాబాద్‌లో ఫారం సమ ర్పించిన వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తామని పేర్కొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles