వేసవి దుక్కులతో పంటకు మేలు

Wed,April 24, 2019 11:51 PM

సిర్పూర్(యు): మెట్ట ప్రాంతంలో వర్షాధారిత పంటలు పం డించే రైతులు వేసవిలో దుక్కులు దున్నడంతో అనేక ఉప యోగాలున్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రు. గత యేడాది ఖరీఫ్ పంటలో భాగంగా వేసిన పత్తి పం ట ముగిసిన తరవాత పత్తి కర్రను తీయడం, దానిని కాల్చి వేయడం చేస్తుంటారు. అలా చేస్తే భూమిలో ఉండే వా నపాములు, మరికొన్ని మేలు చేసే క్రీములు నాశనం అ య్యే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా బ్యాక్టీరియా ద్వారా పత్తికర్రను నాశనం చేసే విధానాన్ని ఎన్నుకోవడం మంచి పద్దతి. అంతే కాకుండా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులు ఎన్నుకోవాలి. అందు లో ఒకటి వేసవి దుక్కి. వేసవి దుక్కులతో పంటకు మేలు కలుగుతుంది. గత నెల వరకు రబీ పంట సాగులో ఉన్న చేళ్లతోపాటు ఖరీఫ్ పంట ముగిసిన చేళ్లలో కనీసం 9 అంగు ళాల లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం వలన ఉం డే ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నారు.

లోతు దుక్కులు దున్నినప్పుడు నేలపై పొరల్లో ఉండే పు రుగులు, తెగుళ్లను నశింపజేయడానికి అవకాశం ఉంటుం ది. నేలలో ఉండి తెగుళ్ల్లు కలుగ చేసే శిలీంద్రాలకు సూర్య రశ్మి సోకుతుంది. ఏప్రిల్, మే నెలల్లో ఉండే అధిక ఉష్ణొగ్రత లకు ఈ పురుగులు శిలింధ్రాలు నశిస్తాయి. కాబట్టి తొలక రిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంటుం ది. తుంగ , గరిక, దర్భ, జమ్ము, వంటి మొండి జాతి కలు పు మొక్కలు చేళ్లలో పెరిగి పంటలకు నష్టం చేస్తుంటాయి. వీటి వేర్లు నేలలో చాలా వరకు విస్తరిస్తాయి. అందువల్ల వా టిని నివారించడం చాలా కష్టమవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు మొక్కల వేర్లు, దుంపలు పెకిలించబడతాయి. దీంతో వేసవిలో ఉండే అధిక ఉష్ణో గ్ర త వలన నశించి పోయే అవకాశం అధికంగా ఉంటుంది. దున్నినప్పుడు నేల పైకి తేలిన వేర్లు, దుంపలు ఏరి వేయ డం వలన వచ్చే యేడాది మల్లి ఇలాంటి మొ క్కలు మొ లవకుండ నివారించవచ్చు.

వేసవిలో బాగా దున్ని ఉన్నం దున నేల బాగా గుల్లబారుతుంది తొలకరిలో వేసే పైర్ల యొ క్క వేర్లు భూమిలో బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, సారే, గుం టుకు వంటి ప రికరాలు నేల లోపలికి సుమారుగ 3 నుండి 5 అంగుళాలు లోతు వరకు చొచ్చుకోని పోతాయి. ఈ పరి కరాలను ఉపయోగించి పదేపదే సేద్యం చేస్తే నేల లోపల సుమారుగా 3నుండి5 అంగుళాల పొర ఏర్పడుతుంది. దీని వలన నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కాబట్టి నేలను లోతుగా దున్నినప్పుడు ఈ పొర చేధింపబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి వస్తుంది. పంట కోతల తర్వాత నేలపై మిగిలే పంటల మొదళ్లు, చేండ్లలో మిగిలిన కలుపు మొక్క లు , పంట నుంచి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రియ పదార్థాలు అన్నీ వేసవిలో లోతుగా దుక్కి దున్నడంతో నేల లో సేంద్రియ శాతం, పోషక పదార్థాలు పెరగడం జరుగు తుంది. ఇలాంటి అనేక ఉపయోగాలుండడంతో న రైతులు తాము చేసుకుంటున్న పోడు వ్యవసాయానికి చెం దిన భూములను వేసవిలోనే దున్నుకోవడం అధికంగ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles