అమ్మింది ఇరవై..మింగింది అరవై..

Wed,April 24, 2019 01:43 AM

తిర్యాణి : ఈ చిత్రంలో ఉన్నది బొమ్మగోని పోసక్క. ఈమెది తిర్యాణి. తల్లిగారి ఊరైన నెన్నెల(మంచిర్యాల జిల్లా) శివారులో సర్వే నం.526/2లో ఆడబిడ్డ కట్నంగా వచ్చిన రెండెకరాల భూమి తన పేరిట ఉంది. 36 ఏళ్ల క్రితమే ఈమె పేరిట పట్టా చేశారు. తనకు ఓ కుమారుడు తిరుపతి (దివ్యాంగుడు), కూతురు అంజలి ఉన్నారు. అంజలి వివాహం నిశ్చయం కావడంతో ఖర్చుల కోసమని తనకున్న రెండెకరాల్లో 20 గుంటల భూమిని నెన్నెలకు చెందిన బిరుదు మల్లేశ్‌కు 22.03.2010న అమ్మింది. మిగతా 60 గుంటలకు సంబంధించిన పట్టా ఉండగా, 17/08/2011న పహణీ కూడా తీసుకున్నది. భూమి పత్రాలు పెట్టి 29/08/2011న నెన్నెలలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ. 18 వేల లోన్ కూడా తీసుకున్నది. అయితే.. గతేడాది భూ ప్రక్షాళన సర్వే జరగడంతో తన కుమారుడు తిరుపతితో కలిసి భూ వివరాలు తెలిపేందుకు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లింది. అసలు పోసక్క పేరిట ఎక్కడ ఎలాంటి భూమి లేదని వారు తెలిపారు.

తను అమ్మిన 20 గుంటలు బిరుదు మల్లేశ్ (తండ్రి ఎర్రయ్య)కు పట్టాకాగా, మిగతా 60 గుంటల భూమి అదే గ్రామానికి చెందిన బిరుదు మల్లేశ్ (తండ్రి శంకరయ్య) పేరిట ఉంది. ఈ విషయమై సంబంధిత సిబ్బందిని అడుగగా, సదరు వ్యక్తికి అమ్మినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. దీంతో బంధువులు, అధికారులు కుమ్మక్కై తమ భూమిని కాజేశారనీ, న్యాయం చేయాలంటూ కుమారుడు తిరుపతితో కలిసి మంచిర్యాల కలెక్టర్‌కు 12/03/2018, 04/06/2018, 23/07/2018న దరఖాస్తులు కూడా చేసుకుంది. కాగా, 20 గుంటలు అమ్మితే.. తమకు తెలియకుండానే 60 గుంటలు పట్టా చేసుకున్నారనీ, ఇదేమని రెవెన్యూ సిబ్బందిని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారనీ, తమది నిరుపేద కుటుంబమనీ, నిత్యం దివ్యాంగుడైన కుమారుడితో కలిసి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles