నకిలీ విత్తనాలతో జాగ్రత్త

Wed,April 24, 2019 01:42 AM

-ఎస్పీ మల్లారెడ్డి
-ఎల్లూర్, ఎల్కపల్లిలో కార్డన్‌సెర్చ్
-గ్రామస్తులతో సమావేశం
పెంచికల్‌పేట్ : నకిలీ విత్తనాలు కొని మోసపోవద్ద ని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఎ ల్లూర్, ఎల్కపల్లిలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో కొందరు దళారులు నకిలీ విత్తనాలను తెచ్చి అమాయక రైతులకు అంటగడుతున్నారన్నా రు. దీంతో పాటు నిషేదిత ైగ్లెఫోసెట్ గడ్డి మందు ను అమ్ముతున్నారనీ, రైతులు కొనవద్దని సూచించారు. లైసెన్స్ గల ఫర్టిలైజర్‌షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలనీ అనుమానితులు కనబడితే వెం టనే పోలీసులకు సమాచారం అందించాలని కో రారు. ఆయన వెంట ఇన్‌చార్జి డీఎస్పీ సత్యనారాయణ, సీఐ కిరణ్, ఈస్‌గాం, పెంచికల్‌పేట్ ఎస్‌ఐలు రాజేశ్వర్, రమేశ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles