మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవాలి

Wed,April 24, 2019 01:42 AM

కెరమెరి: మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీల, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సురేశ్, నరేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూల్తాన్‌గూడ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో మహిళ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదరికం మధ్య జీవిస్తున్న మహిళలు, బాలికలను ఆర్థిక , ప్రలోభాలకు గురి చేస్తున్నారని సూచించారు. ఉద్యోగ అవకాశాలు, సినిమా ఛాన్స్ ఇప్పిస్తాం, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చంటూ చెప్పే మాయమాటలకు మోసపోవద్దన్నారు. అక్రమ రవాణాకు గురైన మహిళలెందరో వ్యభిచార గృహాల్లో నరకం అనుభవిస్తున్నారని, చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అరచకాలను అడ్డుకునేందుకు ఐసీడీఎస్, ప్రజ్వల సంస్థ ఏర్పాటు చేసిన సమాజ జాగృతి సంఘం కృషి చేయాలని, ఎవరికైన ఇలాంటి సంఘటనలు ఎదురైతే 1098 లేదా 100 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది వెంకటయ్య, మంగ, స్నేహ, ప్రమీల అంగన్‌వాడీ టీచర్లు అనసుయ, గుణసుందరి, సంగీత, సక్కుబాయి, స్రవంతి, అనిత, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles