రైతు సమగ్ర సర్వేతో మేలు

Wed,April 24, 2019 01:41 AM

వాంకిడి: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేతో రైతులకు మేలు జరుగుతుందని ఏవో మిలింద్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని బంబార, జైత్‌పూర్, కోమటిగూడ, సోనాపూర్, నార్లపూర్, చౌపన్‌గూడ, వెల్గి గ్రామాల్లో ఏఈవోలు సర్వే చేశారు. రైతుల, వారి భూముల పూర్తి వివరాలు నమోదు చేశారు. బంబార గ్రామంలో నిర్వహించిన రైతు సమగ్ర సర్వేకు ఏవో హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క రైతు విధిగా తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు మానస, స్వాతి, నరేశ్, తండవ్‌కృష్ణ, శంకర్, గురుముర్తి, తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి: రైతు సమగ్ర సర్వేలో రైతులు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తిరుమలేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని మంగీ, మాణిక్యపూర్, గిన్నేదరి, తిర్యాణి పంగిడిమాదర గ్రామాల్లో ఏఈవోలు రైతు సమగ్ర సర్వే నిర్వహించారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు తదితర అంశాలపై నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ప్రతి రైతు పట్టాపాస్ పుస్తకం నంబర్, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్, బ్యాంకు పేరు, ఖాతా నంబర్, ఐఎప్‌సీ కోడ్, తదితర వివరాలు అందజేయాలని కోరారు. సమగ్ర వ్యవసాయ విధానమే లక్ష్యంగా పంట కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సర్వే చేయడంతో రైతులు సాగు చేసే పంటలకు కావాల్సిన అవసరాలను గుర్తించి వాటిని అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు సంజీవ్, ముత్తయ్య, సాగర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు రైతులు సహకరించాలని వ్యవసాయ విస్తరణాధికారి చిరంజీవి కోరారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా మంగళవారం మండలంలోని కొమ్ముగూడ గ్రామంలో 39 అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకొని వారు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తిరుపతి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles