సర్వే లక్ష్యాలను సాధించాలి

Mon,April 22, 2019 11:22 PM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : అసంక్రమణ వ్యాధుల సర్వే లక్ష్యాలను సాధించాలని వైద్యాధికారులు, సిబ్బందికి డీఎంహెచ్‌వో కుమ్రం బాలు సూచించారు. సోమవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌సీడీపై చేపడుతున్న సర్వేలో రాష్ట్రస్థాయిలో జిల్లా ఆశించిన ప్రగతి కనబర్చలేదన్నారు. రాబోయే 15 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలను తప్పక సాధించాలనీ, అప్పటిదాకా ఎవరికీ సెలవులు మంజూరు చేయబడవని తేల్చిచెప్పారు. లక్ష్య సాధనలో వెనుకబడినా, అలసత్వం చూపినా క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదనీ, ఎటువంటి ఒత్తిడీ సహించబోమన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలకు ఎన్‌సీడీ సర్వే నిమిత్తం, గ్లూకో మీటర్, బీపీ అపరేటర్, హైట్, వెయిట్ (ఎత్తు, బరువు) చార్డులు, బరువు తూచే పరికరాలు, టేప్‌లను ఇంతకుముందే అందజేసినట్లు చెప్పారు. అధిక రక్తపోటు, మధుమేహం (డయాబెటిస్), క్యాన్సర్, పక్షవాతం, గుండె జబ్బులు ఎన్‌సీడీలో ముఖ్యమైన జబ్బులనీ, వీటిలో కొన్ని నెమ్మదిగా కొన్ని శరవేగంగా పెరగేవి ఉన్నాయన్నారు. పైకి ఆరోగ్యంగా కనిపించిన లోపల ఈ వ్యాధులతో బాధపడే అవకాశాలున్నాయని తెలిపారు. అందుకే ఈ అసంక్రమణ వ్యాధులను తొలిదశలో గుర్తించి అంచనా వేయడం సర్వే ముఖ్యఉద్దేశ్యమన్నారు. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వారి వారి గ్రామాల్లోనే గుర్తించడం, ఉచితంగా మందులు అందజేస్తారని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సునీల్‌రావు, సుధాకర్‌నాయక్, ప్రాజెక్టు అధికారి సుబ్బారాయుడు, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, శివప్రసాద్, తదితరులున్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles