పరిషత్ పోరుకు సై..

Mon,April 22, 2019 01:31 AM

-నేడు మొదటి విడత నోటిఫికేషన్
-అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-ఈ నెల 24 వరకు నామినేషన్ల స్వీకరణ
-టికెట్ల కోసం ఆశావహుల పోటాపోటీ
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మొదటి విడత పరిషత్ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కాగజ్‌నగర్ డివిజన్‌లోని ఆరు మండలాల్లోని జడ్పీటీసీలతో పాటు 45 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. బెజ్జూర్ మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలు, చింతలమానేపల్లిలో 8, కౌటాలలో 9, దహెగాంలో 8, పెంచికల్‌పేట్‌లో 4, సిర్పూర్-టిలో 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలోని 15 మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్న బెజ్జూర్, కౌటాల, దహెగాం, సిర్పూర్‌టి మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. చింతలమానేపల్లి మండలానికి సంబంధించిన నామినేషన్లు కౌ టాల ఎంపీడీవో కార్యాలయంలో, పెంచికల్‌పేట్ మం డలానికి సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు బెజ్జూర్ ఎంపీడీవో కార్యాలయంలో స్వీకరించనున్నారు. తొలి విడత ఎన్నికల నిర్వహణ కోసం బెజ్జూర్‌లో 40, చింతలమానేపల్లిలో 37, కౌటాలలో 43, దహెగాంలో 45, పెంచికల్‌పేట్‌లో 21, సిర్పూర్-టిలో 41 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

టికెట్ల కోసం పోటాపోటీ..
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. అసెం బ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో పని చేసిన మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. అభ్యర్థుల ఎంపికతోపాటు, వారిని గెలిపించే బాధ్యతలను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లకు అప్పగించడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రాదేశిక ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండడంతో జిల్లాలోని ప్రతి మండలంలోనూ టీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్శితులైన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారు కూడా పోటీలో ఉంటామంటూ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ జనరల్ స్థానాలతో పాటు, రిజర్వేషన్ స్థానాల నుంచి కూడా పోటీలో ఉండేందుకు కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉండడంతో టికెట్లకోసం పోటీ నెలకొంది.

మొదటి దశలో ఎన్నికలు..
బెజ్జూర్ జడ్పీటీసీతో పాటు బారెగూడ, రెబ్బెన, ఊట్సారంగపల్లి, మర్తిడి, కుకుడ, బెజ్జూర్, పాపన్‌పేట్, కుశ్నపల్లి ఎంపీటీసీ స్థానాలు
చింతలమానెపల్లి జడ్పీటీసీతో పాటు రణవెల్లి, గంగాపూర్, గూడెం, కర్జెల్లి, బాబాసాగర్, డబ్బ, చింతలమానెపల్లి, రవీంద్రనగర్-1 ఎంపీటీసీ స్థానాలు.
కౌటాల జడ్పీటీసీతో పాటు తాటిపల్లి, మొగడ్‌దగడ్, గుండాయిపేట్, గుడ్లబోరి, గురుడుపేట్, కన్నెపల్లి, కౌటాల, ముత్యంపేట్, సాండ్‌గాం ఎంపీటీసీ స్థానాలు
పెంచికల్‌పేట్ జడ్పీటీసీతో పాటు ఎల్లూర్, చేడ్వాయి, పెంచికల్‌పేట్, కొండపల్లి ఎంపీటీసీ స్థానాలు.
సిర్పూర్-టి జడ్పీటీసీతోపాటు సిర్పూర్- 1, సిర్పూర్ -2, సిర్పూర్ -3, హుడ్కిలి, వెంకట్రావ్‌పేట్, వేంపల్లి, చింతకుంట, డోర్‌పల్లి ఎంపీటీసీ స్థానాలు.
దహెగాం జడ్పీటీసీతో పాటు బారెగూడ, ఐనం, దహెగాం, అత్తిని, కుంచవెల్లి, ఒడ్డుగూడ, చంద్రపల్లి, గిరివెల్లి ఎంపీటీసీ స్థానాలు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles