తేలిన పోలింగ్ కేంద్రాల లెక్క

Mon,April 22, 2019 01:29 AM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యా రు. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నమోదైన ఓటర్ల ప్రకారం మండలంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 24734 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో సవరణలు జరిగే అవకాశాలున్నాయి. చేర్పులు, మార్పులు, తొలగింపులపై స్పష్టత రావాల్సి ఉంది.

51 పోలింగ్ కేంద్రాలు..24,734 మంది ఓటర్లు
మండలంలో 24,734 మంది ఓటర్లు వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి..
ఆడ పరిధిలో ఆడలో మండల పరిషత్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం-1లో 595 మంది ఓటర్లు, పోలింగ్ కేంద్రం -2లో 586 మంది, మానిక్‌గూడ్ పాఠశాల కేంద్రంలో 334 మంది, ఎల్లారం పరిధిలో ఎల్లారం ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం-1లో 508, పోలింగ్ కేంద్రం-2లో 513 మంది, పోలింగ్ కేంద్రం-3లో 672 మంది, కౌటాగూడ ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో 569, అంకుశాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 444 మంది, అంకుశాపూర్ ప్రభుత్వ పాఠశాల కొత్త భవనంలో పోలింగ్ కేంద్రం -1లో 444, పోలింగ్ కేంద్రం-2లో 594, గుండి పరిధిలో సాలేగూడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 412, పోలింగ్ కేంద్రం-2లో 418 మంది, గుండి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 429, పోలింగ్ కేంద్రం-2లో 429, పోలింగ్ కేంద్రం-3లో 575, గోవింద్‌పూర్ పాఠశాల కొత్త భవనంలోని పోలింగ్ కేంద్రంలో 420, రహపల్లి పరిధిలో ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 464, పోలింగ్ కేంద్రం-2లో 464 మంది, చోర్‌పల్లి పాఠశాలలో పోలింగ్ కేంద్రం-1లో 484, పోలింగ్ కేంద్రం-2లో 484, బురుగూడ పరిధిలో బురుగూడ జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 519, పోలింగ్ కేంద్రం-2లో 528, పోలింగ్ కేంద్రం -3లో 691 మంది,

మోతుగూడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 378, పోలింగ్ కేంద్రం-2లో 378, పోలింగ్ కేంద్రం-3లో 511, బాబాపూర్ పరిధిలో బాబాపూర్ పాఠశాల కేంద్రం-1లో 387, పోలింగ్ కేంద్రం-2లో 387, పోలింగ్ కేంద్రం-3లో 524, తుంపల్లి పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 404, పోలింగ్ కేంద్రం-2లో 406, కోసర ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 580, మోవడ్ పరిధిలో వావుదాం గిరిజన ప్రైమరీ పాఠశాల భవనంలోని పోలింగ్ కేంద్రంలో 519, మాలన్‌గొంది గిరిజన ప్రైమరీ పాఠశాల కొత్త భవనంలో 559 మంది, మోవాడ్ ఆశ్రమ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం-1లో 420 మంది, పోలింగ్ కేంద్రం-2లో 413 మంది, వెంకటాపూర్‌లోని మోడల్ ప్రైమరీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో 577, ఆడదస్నాపూర్ గిరిజన ప్రైమరీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 366, చిర్రకుంట పరిధిలోని చిర్రకుంట ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 480 మంది, పోలింగ్ కేంద్రం-2లో 480 మంది, చిర్రకుంటలోని పైకభవనంలోని పోలింగ్ కేంద్రంలో 640, పాడిబండలోని గిరిజన పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 492, పోలింగ్ కేంద్రం-2లో 492, ఈదులావాడ పరిధిలో ఈదులావాడ పాఠశాల కొత్త భవనంలోని పోలింగ్ కేంద్రంలో419 మంది, ఈదులావాడ పాఠశాల పాత భవనం పోలింగ్ కేంద్రంలో 423 మంది, ఈదులావాడ పైక భవనం పో లింగ్ కేంద్రంలో 551, చిలాటిగూడ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 425 మంది, రౌటసంకేపల్లి పరిధిలో రౌటసంకేపల్లి పాఠశాల భవనం పోలింగ్ కేంద్రం-1లో 567 మంది, పోలింగ్ కేంద్రం-2లో 562 మంది, అప్పపల్లి పాఠశాల పోలింగ్ కేంద్రం-1లో 407 మంది, పోలింగ్ కేంద్రం-2లో 411 మంది ఓటర్లు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇందులో కొంత మేరకు మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.

50
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles