ప్రాదేశిక పోరు తీన్‌మార్

Sun,April 21, 2019 12:22 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పరిషత్ ఎన్నికల నిర్వహణకు శనివారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 15 మండలాల్లోని 15 జడ్పీటీసీలు, 123 ఎంపీటీ స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడత మే 6న, రెండో విడ త మే 10న, మూడో విడత 14న నిర్వహించి మే 27న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేయనున్నారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు..
ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగనున్నాయి. ఎంపీటీసీ స్థానానికి గులాబీ, జడ్పీటీసీ స్థానానికి తెలుపు రంగు పత్రాలు వినియోగించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం ప్రకటించింది. జడ్పీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు రూ.4 లక్షలు ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు రూ.1.50గా లక్షలుగా నిర్ణయించారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల లెక్కలను ఖాతాల ద్వారానే చెల్లించాలనే నిబంధనలు విధించింది. నామినేషన్లు అన్ని మండల కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరణ ఉం టుంది. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోకవర్గాల ఎన్నికల నిర్వహణకు ప్రక్రియమొదలైంది. జిల్లాలోని 15 మండలాల్లో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 22న మొదటి విడత, 26 రెండో విడత, 30న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా లో 462 పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. పోలింగ్ నిర్వహణకోసం ఏపీఓ, పీఓ, ఇతర సహాయక సిబ్బంది కలుపుకొని 2627 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.

మూడు దశల్లో ఎన్నికలు
మొదటి దశలో: కాగజ్‌నగర్ డివిజన్‌లోని ఆరు మండలాలు బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, పెంచికల్‌పేట్, సిర్పూర్-టి మండలాల్లోని 45 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడులైన రోజు నుంచి 24 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 25న పరిశీలన, వ్యాలీడ్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలపై 26న అప్పీలుకు అవకాశం ఉంటుంది. 28 వరకు విత్‌డ్రాలు చేసుకోవచ్చు. 28న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేసి మే 6న తొలివిడుత ఎన్నికలు నిర్వహిస్తారు.

రెండో దశలో: కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బన, తిర్యాణి మండలాల్లో ని 42 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 26న విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడులైన నాటి నుంచి 28 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పరిశీలించి అదేరోజు వ్యాలీడ్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలపై 30న అప్పీలుకు అవకాశం కల్పిస్తారు. మే 2 వరకు విత్‌డ్రాలు చేసుకోవచ్చు. ఇదేరోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదలచేస్తారు.
రెండో విడత ఎన్నికలు మే 10 నిర్వహిస్తారు.
మూడో దశలో: జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్-యు, వాంకిడి మండలాల్లోని 36 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కోసం ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 30 నుంచి మే 2 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ల స్వీకరిస్తారు. మే 3న పరిశీలన, వ్యాలీడ్ అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుంది. అభ్యంతరాలపై మే 4 న అప్పీలుకు అవకాశం కల్పిస్తారు. మే 6న విత్‌డ్రాలు చేసుకోవచ్చు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. మే 14 పోలింగ్ నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు..
ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసే విధానం అందుబాటులోకి వచ్చింది. నామినేషన్ పత్రాల కోసం రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. క్యాండిడెట్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఆన్‌లైన్ నామినేషన్ ఫర్ రూరల్ బాడీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జడ్పీటీసీ స్థానానికి ఆన్‌లైన్ నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్ చూ పెడుతుంది. ఏ అభ్యర్థి ఏ పదవికి పోటీ చేస్తున్నారో దానిని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలి.

ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో నమోదు చేసే వెసులుబాటు ఉన్నది. ఆస్తులు, ఇతరపత్రాలు పీడీఎఫ్ ఫైల్ రూపంలో అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్‌మిట్ నామినేషన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ కాపీని ప్రింట్ తీసుకుని ఖచ్ఛితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్ సబ్‌మిషన్ నామినేషన్ పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అభ్యర్థుల డిపాజిట్లు..
పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు మొదలుకుని వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనరల్ జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5వేలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌కు కేటాయించిన జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.1,250 డిపాజిట్ చేయాలి. జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్‌లో రాయితీ ఉంటుంది. జనరల్ జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్ రూ.2,500, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,250 డిపాజిట్లు చేయాలి.

74
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles