బాధిత రైతులను ఆదుకుంటాం

Sun,April 21, 2019 12:21 AM

చెన్నూర్ రూరల్: పంటలు నష్టపోయిన రైతులను ప్రభు త్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలుకు కిష్టంపేటలో దెబ్బతిన్న పంటలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు చెన్నూర్ మండలంలో సుమారు 1902 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలో తేలిందని ఎమ్మెల్యే సుమన్ చెప్పారు. ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలా చూడాలని వ్యవసాయ అధికారి వంశీకి సూ చించారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే చేసి, పం టలు నష్టపోయిన రైతుల వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఏవోకు సూచించారు. అనంతరం ఏడీతో ఫో న్‌లో మాట్లాడారు. రైతులకు పరిహారం తొందరగా వచ్చేలా చూడాలని కోరారు. పంటలకు ఇప్పటి వరకు బీమా చేయించుకోలేని రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. నియోజక వర్గంలో మామిడి, వరి పంటలు నష్టపోయిన రైతుల పూర్తి వివరాలతో కూడిన నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లనున్నట్లు తెలిసారు. కాక్యక్రమంలో సర్పంచ్ బుర్ర రాకేష్ గౌడ్, మాజీ ఎంపీపీ మల్లెల దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్, రత్న సమ్మిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు ఉన్నారు.

భీమారం : పోలంపల్లి శివారులో దెబ్బతిన్న పంటలను సుమన్ శనివారం పరిశీలించారు. దాదాపు 1400 ఎకరా ల్లో పంట నష్టం వాటిల్లి ఉంటుందని సంబంధిత అధికారు లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తానని తెలిపారు.జడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్, సర్పంచులు దర్శనాల రమేష్, దాడి తిరుపతి, దుర్గం మల్లేష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చెఱుకు సరోత్తమరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు వేముల శ్రీకాంత్ గౌడ్, నియోజక వర్గ కోర్డినేటర్ కలగూర రాజ్ కుమార్, నాయకులు వేముల ప్రణీత్ గౌడ్ , వీరగోణి రమేష్ గౌడ్ , పోటు మహేష్ రెడ్డి, జలంపల్లి తిరుపతి, వడ్ల కొండ తిరుపతి, మహేశ్వర్ రెడ్డి , డొంగ్రి రాజలింగు, కమ్మగోణి సాయితేజ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles