ప్రజలకు చేరువకావాలి

Sun,April 21, 2019 12:21 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో పోలీ స్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటు న్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులు తదితర అంశాలను సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నివారణ, నేర విచారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్, ఇతర శాఖల సిబ్బంది సహకారంతోనే అ సెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికలు ప్రశాం త వాతావరణంలో నిర్వహించామన్నారు. ప్రతి పోలీస్ అధికారి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ప్రజలకు సేవ చేసి మరింత చేరువ కావాలన్నారు. మొబైల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలనీ , పోలీస్ వ్యవస్థ సేవలను ప్ర జలకు చేరువలో ఉండాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల వివరాలు సీసీటీఎన్‌లో అప్‌లోడ్ చేయాలనీ , పెండింగ్ కేసులను పూర్తి చేయాలన్నారు.

ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ సిస్టం తప్పకుండా అమలు చేయాలన్నారు. డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. రాత్రిపూట పెట్రోలింగ్ సమయంలో అనుమాస్పదంగా కనిపించే వారి పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా తనిఖీ చేయాలన్నారు. గత ఎన్నికలలో పాత నేరస్తులు, ఆరాచకాలకు పాల్పడిన వారిని వెంటనే బైండోవర్ చేయాలని సూచించారు. నేర చరిత్ర ఉన్న వారిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. పాత, గత నెలలో జరిగిన కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకారించాలని కోరారు. మూల మలుపుల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసిందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి నడిపేలా చూడాలన్నారు. మిస్సింగ్ కేసుల ఫిర్యాదు వస్తే ఆ వ్యక్తి యొక్క ఫొటోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించి కనిపెట్టేందుకు ప్రయత్నించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిల్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. సమావేశంలో ఏఎస్పీ గోధ్రు, డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ కాశయ్య, స్థాయిన సీఐ మల్లయ్య, జిల్లాలోని సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles