దరఖాస్తుల ఆహ్వానం

Sun,April 21, 2019 12:20 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందకుకు అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకానికి జిల్లాలోని షెడ్యూల్ కులాల విద్యార్థులు ఆసక్తి గల వారు ఏప్రిల్ 22 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరమునకుగాను విదేశాల్లో ఉన్నత విద్య చదువులనుకునే విద్యార్థులకు అర్హత కలిగిన వారికి ప్రభుత్వం 20లక్షల ఉపకార వేతనం అందిస్తుందని తెలిపారు. యుఎస్‌ఏ, యూకే, అస్ట్రేలియా, కెనడా, సింగాపూర్, జర్మనీ, సౌత్ కొరియా, న్యూజిలాండ్ దేశాల్లోని విశ్వ విద్యాలయాల్లో పీజీ చేసేందుకు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు అర్హత కలిగిన ఎస్సీ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలనీ, ఏడాదిలో రూ. 5లక్షల ఆదాయం మించకుండా ఉండాలనీ, తగిన విద్యార్హతలు, పాస్‌పోర్ట్, వీసా ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నా రు. www. telangana epas. cgg.gov. in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపా రు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 25వ తేదీన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో మసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఆర్ భవన్‌లోని 3వ అంతస్తులో డైరెక్టర్ షెడ్యూల్ కులాల అభివృద్ధ్ది శాఖ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles