రామభక్త హనుమాన్‌కీ జై..

Fri,April 19, 2019 11:46 PM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా శుక్రవారం చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయాన్నే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. కేస్లాపూర్ వీరంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభం కాగా గణపతి , నవగ్రహ పూజ, పూర్ణహుతి తదితర కార్యక్రమాలను ఆల య అర్చకుడు వొజ్జల శిరీష్ శర్మ, పండితులు మ ధుకర్ శర్మ, సూర్యనారాయణ శర్మ, మహేశ్ శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురి వెంకటేశ్వర్లు, గుండ వెంకన్న పాల్గొన్నారు.

తాగునీరు పంపిణీ..
జయంతి వేడుకలకు హాజరైన భక్తులకు పద్మశాలీ సంఘం, వాసవీ క్లబ్, లయన్స్ క్లబ్, బీజేవైఎం, మున్నూర్ కాపు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అరిగెల నాగేశ్వర్‌రావు తాగునీరు, మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు చెన్నురి అశోక్, బండి శ్రీనివాస్, అనుమండ్ల శ్రీకాంత్, జంజిరాల శ్రీనివాస్, వనమాల ధర్మయ్య, రాజు, సునీత, జయ, రాజమణి, సుజాత, బీజేవైఎం జిల్లా ఆధ్యక్షుడు కాండ్రె విశా ల్, లయన్స్ క్లబ్ సభ్యులు కోట వెంకన్న, వాసవీ క్లబ్ సభ్యులు రమేశ్, రవి, చిలువేరు వెంకన్న, శ్రీనివాస్, మున్నురు కాపు సంఘం నాయకులు సురేశ్,సతీష్,శ్రీనివాస్ తదితరులున్నారు.

కాగజ్‌నగర్‌లో శోభాయాత్ర ..
కాగజ్‌నగర్ టౌన్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భజరంగ్‌దల్, విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో శోభాయాత్రను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో హనుమాన్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి హనుమాన్ ఆలయంలో స్వాములు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. భజాభజంత్రీలు, నృత్యాలు నడుమ జై శ్రీరాం నినాదాలు చేస్తూ రాజీవ్ గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన మార్కెట్ ఏరియా ప్రధాన వీధుల గుండా తిరుగుతూ త్రిశూల్ పహాడ్ పై ఉన్న ఆంజనేయ విగ్రహం వరకు సాగింది. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసిఫాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో టౌన్ ఎస్‌హెచ్‌వో కిరణ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles