గాలివాన బీభత్సం

Fri,April 19, 2019 11:46 PM

కౌటాల/బెజ్జూర్/కాగజ్‌నగర్ రూరల్ : జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కౌటాల మండలంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలి రావడంతో కౌటాల- మొగడ్‌ధగడ్, విర్దండి- గుండాయిపేట రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో 8 విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బెజ్జూరులో సాయంత్రం వడగండ్లు పడ్డాయి. భారీ ఉరములు, మెరుపులతో వర్షం కురవగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కాటెపల్లి, కుకుడ, పోతెపల్లి, మర్తిడి, కుశ్నపల్లి తదితర గ్రామాలలో వర్షం కురువగా మండల కేంద్రం లో భారీగా వడగండ్లు పడ్డాయి.

కాటెపల్లికి చెం దిన మెంగనబోయిన పోశన్న గేదె గురువారం రాత్రి పిడుగు పాటుతో మృతి చెందినది. దీని విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుంది. కా గజ్‌నగర్ పట్టణంలోని పలు కాలనీల్లోని చెట్లు విరిగి రోడ్డపై పడ్డాయి. ద్వారకానగర్‌లోని ఓ ఇంటి గోడ కూలి కారుపై పడడంతో నుజ్జునుజ్జు అయ్యింది. కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని జియో టవర్‌పై ఉన్న జనరేటర్ గాలికి పక్కన ఉన్న ఇంటిపై పడిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మైనార్టీ ఫంక్షన్ హాలు స మీపంలో కారుపై చెట్టు పడడంతో ధ్వంసమైం ది. చిలువేరు మార్గంలోని వృక్షాలు నెలకొరిగా యి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పూ త,కాతపై ఉన్న మామిడి కాయలు, పిందెలు నెలరాలా యి. పలుకాలనీల్లో డ్రైనేజీలు చెత్తచెదారం పేరుకపోవడంతో రోడ్లపైకి మురుగు నీరు చేరింది.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles