వైభవంగా హనుమాన్ జయంతి

Fri,April 19, 2019 11:46 PM

వాంకిడి: మండల కేంద్రంతో పాటు బంబార, నార్లపూర్ గ్రామాల్లో శుక్రవారం చిన్న హనుమాన్ జయంతోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులతో పాటు హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బంబార ఎంపీటీసీ వినోద్, ఉపసర్పంచ్ ప్రకాశ్, బంబార మాజీ సర్పంచ్ అప్పాల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్: మండలంలోని కొత్తపల్లి, పిక్లాతండా, మామిడిపల్లి. వంజారిగూడ. కంచన్‌పల్లి. మొతిపటార్. పిట్టగూడ. లోద్దిగూడ గ్రామాల్లో శుక్రవారం హనుమాన్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాలకు భక్తులు ఉదయం నుంచే చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భజన కార్యక్రమాలు జరిపారు. గత 41, 21, 11 రోజులుగా హనుమాన్ మాలాధారణ చేసి స్వాములు దీక్ష విరమించారు.

జైనూర్: మండల కేంద్రంతో పాటు ఉషెగాం, జంగాం గ్రా మాల్లోని హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జైనూర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సిర్పూర్(యు): మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి మొక్కుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles