పనులు వేగవంతం చేయాలి

Fri,April 19, 2019 11:45 PM

తిర్యాణి: మండలంలో కొనసాగుతున్న నర్సరీ ప నులు వేగవంతం చేయాలని ఈజీఎస్ ఏపీవో శ్రావణ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గంభీరావుపేట, ఏదులఫాడ్, తి ర్యాణి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆయన సందర్శించారు. పూల, పండ్ల విత్తనాలతో పాటు మొక్కలకు నీడ కోసం సైడ్‌నెట్‌లను నర్సరీల నిర్వాహకులకు అందజేశారు. ఈసందర్భంగా ఈజీఎస్ ఏపీవో మాట్లాడు తూ, రానున్న హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరగా మొక్కలను ఫిల్లింగ్ చేయలనీ, ఎపటికప్పుడు కలుపు మొక్కలు పెరగకుండా చూడాలని సిబ్బందికి, నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం ఇటీవల అందజేసిన నీటి డ్రమ్ముల్లో నీరు నిలువ ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగే సమయంలో ఆ నీరు ఉపయోగించుకోవచ్చని సూచించారు. మండలంలో 20 నర్సరీల్లో పనులు సాగుతున్నాయన్నారు. పంచాయతీల వారిగా పోటీపడి నిర్ణీత గడువులోగా నర్సరీల పనులు పూర్తి చేసి ముందంజలో నిలిచేలా సంబంధిత టీఏలు, ఎఫ్‌ఏలు కృషి చేసి పేరు తెచ్చుకోవాలని, లేనిచో చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎదులపాడ్ సర్పంచ్ మడావి గోపాల్, టీఏ, ఎఫ్‌ఏలు, నిర్వాహకులు ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles