స్మార్ట్‌ఫోన్ పంపుతామని మోసం

Fri,April 19, 2019 11:45 PM

నెన్నెల : ఓ విద్యార్థి స్మార్ట్ ఫోన్ పేరిట మోసపోయాడు. అగంతకులు ఖాతా, ఏటీఎం నంబర్లు తెలు సుకుని రూ. 75వేలు డ్రా చేసుకున్నారు. మోస పోయిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తాపూర్‌కు చెందిన బోగి రవి అనే ఇంటర్ విద్యార్థి పదిహేను రోజుల క్రితం ఫోన్‌కు లక్కీ డ్రాలో స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నట్లు మెసేజ్ వచ్చింది. లక్కీ డ్రా పేరుతో రూ. 75 వేలు పొగొట్టుకున్నాడు. ఫోన్ తీసుకోవాలంటే కొరియర్ పంపిస్తామని అడ్రస్ తెలుసుకున్నా రు. కొన్ని రోజుల తర్వాత అడ్రస్ సరిగా లేదని మీరు గెలుచుకున్న ఫోన్‌ను సకాలంలో పంపించలేకపోతున్నామనీ, మరో మారు పూర్తి వివరాలు కావాలని చెప్పడంతో రవి అన్ని విషయాలు చెప్పాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత అగంతకులు ఫోన్ చేసి అడ్రస్ సక్రమంగా లేదని ఫోన్ పంపలేదని చెప్పాడు. ఫోన్ కు బదులు దానికి సరిపడా రూ.10 వేలు పంపిస్తామనీ, అందుకు మీ బ్యాంకు ఖాతా నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్ ఇవ్వాలని కోరడంతో రవి నంబర్లు ఇచ్చాడు. దీంతో వెంటనే అందులో నుంచి రూ. 15 వేలు డ్రా చేసుకున్నట్లు మేసేజ్ వచ్చింది. మరో సారి ఆన్‌లైన్ మోసగాళ్లు ఫోన్ చేసి మరో ఖాతా నెంబర్, పిన్ నెంబర్ ఇవ్వాలనీ కోరడంతో మళ్లీ ఇచ్చాడు. అందులో నుంచి రూ. 15 వేలు డ్రా చేశారు. ఇలా చెప్పి మొత్తం రూ. 75 వేలు డ్రా చేసుకున్నారు. ఖాతాలో డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ల గా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రవి మోసానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐ మొగిలి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

59
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles