పల్లెల్లో సాగు సర్వే..

Fri,April 19, 2019 02:23 AM

- లాభసాటి వ్యవసాయం కోసం సర్కారు కసరత్తు
- పల్లెల్లో కొనసాగుతున్న సమగ్ర సర్వే
- వచ్చే నెల 15లోగా పూర్తి చేసేందుకు చర్యలు
- 39 అంశాలతో వివరాలు సేకరణ
-= పంటల కాలనీల ఏర్పాటే లక్ష్యం

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, పలు కార్యక్రమాలతో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమాతో భరోసానివ్వగా, తాజాగా ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పంట కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నది. ఈ మేరకు పల్లెల్లో సమగ్ర సర్వే చేపడుతుండగా, రైతు పేరు, సాగు భూమి, సెల్ నంబర్, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్, వానకాలం, యాసంగిలో సాగు చేసే పంటలు.. ఇలా మొత్తం 39 అంశాలను సేకరిస్తున్నది. నివేదికల ఆధారంగా ఏ ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలో దిశానిర్దేశం చేసే అవకాశమున్నది.

వ్యవసాయ అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ సర్కార్ చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు రైతున్న కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమాతో సాగు సంబురంగా సాగుతుండగా, ఆదాయా న్ని రెట్టింపు చేయాలనే సంకల్పంతో పం ట కాలనీల ఏర్పాటుకూ శ్రీకారం చుట్టింది. మరోవైపు అన్నదాతకు మరిం త భరోసానిచ్చేందుకు సమగ్ర సర్వే చేపడుతున్నది. రైతు పేరు, సాగు భూమి ఎంత, సెల్ నంబర్, బ్యాంకు ఖాతా, ఆ ధార్ నంబర్, వానకాలం, యాసంగి లో సాగు చేసే పంటలు.. ఇలా మొత్తం 39 అంశాలను సేకరిస్తున్నది. వచ్చే నెల 15వ తేదీ వరకు ఈ సర్వేను పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. సర్వే అనంతరం నివేదికలను బట్టి ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పంట లు సాగు చేయాలో రైతులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రభుత్వం రాబోయే రో జుల్లో రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టే పథకాలకు రూపకల్పన చేయనున్నది.

లాభసాటిగా మార్చేందుకు..
ఏళ్లకేళ్లుగా ఒకే రకమైన పంటలు పండించడం, దిగుబడులు తగ్గిపోవడం, పంటలను విక్రయించే సమయంలో అనేక ఇబ్బందులు పడడంవంటి కష్టాల నుంచి రైతులను గట్టెక్కించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. సంప్రదాయబద్ధంగా వ్యవసాయాన్ని మార్చి రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని నేర్పించడంతో పాటు, రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండిస్తారో పూర్తి స్థాయిలో సమగ్ర వివరాలను సేకరిస్తున్నది. పంటలను సర్వేచేసి వాటికి అనుబంధంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నది. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు విక్రయించుకునేలా చర్యలు చేపడుతోంది. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు సాగు చేయాలి, ఏ పంటలు సాగుచేసే ఎలాంటి లాభాలు వస్తాయి, స్థానిక ప్రజల ఆహార అవసరాలు ఏమిటి, సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోవడం ఎలా అనేక విషయాలతో ప్రభుత్వం రైతులకు వ్యవసాయంలో నూతన ఒరవడిని తీసుకురానున్నది. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమల శాఖల సమన్వయంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవడమేగాకుండా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా, సాగు విధానంలో నూతన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

39 రకాల అంశాలతో..
జిల్లాలోని 15 మండలాల్లోని 412 గ్రామాల్లో సుమారు 94 వేల మంది రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సుమారు 39 రకాల అంశాలతో కూడిన ఫార్మెట్‌లో వివరాలను సేకరిస్తున్నారు. భూముల వివరాలు, సాగు చేసే పంటలు, సాగు నీటి వనరులు, ఎలాంటి దిగుబడులు, పెట్టుబడి ఎంత, ఎరువులు, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు తదితర సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైతులు పండించే పంటలకు ఎంత గిట్టుబాటు అవుతుంది, లాభం వస్తుందా, లేక నష్టం ఏమేరకు కలుగుతుంది అనే వివరాలు కూడా తీసుకుంటున్నారు. దీంతో పాటు రైతుల భూ పట్టాల వివరాలు, బ్యాంకుల సమాచారం, రైతు స్థితిగతులు, సామాజిక స్థితి ఇలా అన్ని విధాలా సమాచారాన్ని తీసుకుంటారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles