పెద్దవాగులో మునిగి హన్మాన్ దీక్షాపరుడు మృతి

Fri,April 19, 2019 02:21 AM

దహెగాం : మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన హన్మాన్ దీక్షాపరుడు కుకిడె రాజేష్(22) పెద్ద వాగులో మునిగి మృతి చెందాడు.తోటి దీక్షాపరులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉనానయి. దీక్ష విరమణ కోసం కొండగట్టుకు బయలు దేరే ముందు వాగులో స్నానం చేసేందుకు తోటి భక్తులతో కలిసి వాగుకు వెళ్లాడు. పెద్దవాగుపై వంతెన నిర్మాణ సమీపంలో స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. స్నానం చేసే ప్రదేశంలో వంతెన నిర్మాణం కోసం ఇసుక తీయడంతో లోతు ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించని రాజేశ్ స్నానానికి దిగి నీటి మునిగిపోయాడు. గమనించిన తోటి భక్తులు వెంటనే నీటిలోకి దిగి రాజేష్‌ను బయటకు తీసి పెంచికలపేట ఆర్‌ఎంపీ వద్దకు తీసుక వెళ్లారు. రాజేశ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు సేకరించాడు.

- లగ్గాంలో విషాదం
కుకిడె రాజ్‌ష్ ప్రమాదవశాత్తూ పెద్దవాగులో పడి మృతి చెందడంతో లగ్గాంలో విషాదచాయలు నెలకొన్నాయి. రాజేష్‌తో పాటు మరో పది మంది యువకులు 21 రోజుల హన్మాన్ దీక్ష స్వీకరించారు. మాల విరమణ కోసం కొండగట్టుకు వెళతామనే క్రమంలో రాజేశ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా కుకిడె తిరుపతమ్మ, సత్యనారాణలకు ఇద్దరు కూతుళ్ల పాటు కుమారుడు రాజేష్ ఉన్నారు. కాగా రాజేష్ ఎదిగినప్పటి నుంచి వ్వవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనుకొని విధంగా రాజేష్ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

51
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles