కొనసాగుతున్న రైతు సమగ్ర సర్వే

Fri,April 19, 2019 02:18 AM

కాగజ్‌నగర్ రూరల్ : మండలంలో రైతు సర్వే కొనసాగుతున్నది. గురువారం అనుకోడ, గన్నారం, బోడపల్లిలో ఏఈవోలు రైతుల నుంచి 39 అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం పంట కాలనీల ఏర్పాటు, మార్కెటింగ్, వివిధ రకాల పంటల సాగు, ఆదాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏఈవో యువరాణి, ఫజల్, రైతులు పాల్గొన్నారు.

కౌటాల: రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలని మండల వ్యవసాయాధికారి పాలకుర్తి రాజేశ్ అన్నారు. గురువారం తలోడి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సంబంధిత పథకాల రూపకల్పనకు భూముల వివరాలు, ఆధార్ నంబర్, పట్టాదారు పుస్తకం, ఖాతా వివారాలు, రైతు పండించే పంటల వివరాలు, పంటలకు వాడే సాగునీటి సౌకర్యం వివరాలను ఏఈవోలకు అందించాలన్నారు. ప్రతి రైతు బీమా చేసుకోవాలని సూచించారు. ఏఈవోలు రవి, అంజన్న, గ్రామస్తులున్నారు.

సిర్పూర్(టి): మండలంలోని చీలపల్లిలో గురువారం వ్యవసాయాధికారి రామకృష్ణ పంటకాలనీలపై వ్యవసాయానికి సంబంధించిన 39 అంశాలపై సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్‌లో పంటకాలనీలకు ప్రణాళికలు రూ పొందించుకోవచ్చాన్నారు. చీలపల్లి సర్పంచ్ యాదగిరి బ్రహ్మ య్య, ఏఈవో నేహ తబస్సుమ్, రైతులు పాల్గొన్నారు.

బెజ్జూర్ : మండలంలోని కాటెపల్లి, ముంజంపల్లిలో గురువారం వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించారు. భూమి, స్వభావం, సర్వే నెంబరు, సాగుకు పనికి వచ్చే భూమి, నీటి వసతి, పంట వివరాలతో పాటు పశువులు, బ్యాంకు ఖాతా, ఆధార్‌నెంబరు, మార్కెటింగ్ సదుపాయాలు తదితర 39 అంశాల వివరాలు రైతుల నుంచి సేకరించారు. భవిష్యత్తులో సర్వే వివరాలే కీలకంగా మారుతాయన్నారు. ఏఈఓ రవితేజ, మారుతి, సర్పంచ్ సిడాం భీంరావ్, నాయకులు సకారాం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles