వరి కొనుగోళ్లకు రెడీ..

Thu,April 18, 2019 12:01 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో యాసంగి పంటల కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 33 వరి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రైతులకు నష్టం కలుగకుండా కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏ గ్రేడు వరికి రూ. 1770, సాధారణ రకాలకు రూ. 1750 ధరను నిర్ణయించారు.

జిల్లాలో 33 వరి కొనుగోలు కేంద్రాలు...
జిల్లా వ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ద్వారా 22, ఐటీడీఏ ద్వారా 3, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 4, జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో రైతులు సాధారణ రకాలకంటే మేలు రకానికి చెందిన సన్నరకం వడ్లనే అధికంగా పండిస్తున్నారు. ఈ యాసంగిలో మంచి దిగుబడి రావడంతో అధికారుల అంచనాలకు మించి వరి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.

యాసంగిని ఆదుకున్న 24 గంటల విద్యుత్
జిల్లాలో ఎక్కువగా రైతులు మోటార్లపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. చెరువులు, ప్రాజెక్టుల ద్వారా సాగు అంతంత మాత్రమే కొనసాగుతుండగా, పంపుసెట్ల ద్వారానే అధికంగా వరి సాగవుతోంది. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో పంటలకు పుష్కలంగా నీరు అందుతోంది. జిల్లా వ్యాప్తంగా 3,703 ఎకరాల్లో వరింట సాగు చేయగా 2,40,695 క్వింటాళ్ల వరకు ది గుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రంగంలోకి దళారులు
గత ఖరీఫ్‌లో మిల్లర్ల మాయాజాలంతో వరి ధాన్యాన్ని రూ. 13 వేల నుంచి రూ. 14 వేలకే క్వింటాలు చొప్పున దళారులకు విక్రయించి, అన్నదాతలు నష్టపోయారు. మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడి చేశారు. దళారుల వద్దనుంచి వచ్చే ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిన మిల్లర్లు రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని కొనుగోలు చాలా వరకు తీసుకోలేదు. గత్యంతరం లేని స్థితిలో దళారులకు ధాన్యాన్ని అమ్ముకున్నారు. గత ఖరీఫ్‌లో రైతులు సన్నరకం వడ్లకు కనీసం రూ. 1500 కూడా దొరకలేదు. ఈ ఏడాది ముందుగానే ప్రభుత్వం ఇబ్బదులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లోకే తేవాలని అధికారులు సూచిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు...
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్నిరకాల ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఈమేరకు జేసీ రాంబాబు రెండురోజుల క్రితం మార్కెటింగ్, ఐకేసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పలుసూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల కోసం పూర్తిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటి వసతితోపాటు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈమేరకు అధికారులు వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles