ఆయిల్ ఫాంతో అధిక దిగుబడి..

Thu,April 18, 2019 12:01 AM

కెరమెరి: ఆయిల్‌ఫాంతో అధిక దిగుబడి పొందవచ్చని భారతీయ ఆయిల్ ఫాం పరిశోధన సంస్థ రిసెర్చ్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంబీ ప్రసాద్ బుధవారం ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మ ధుసుధన్, భారతీయ ఆయిల్‌ఫెడ్ సంస్థ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి ధనోర గ్రామంలో సాగుచేస్తున్న ఆపిల్ తోటను సందర్శించారు. చెట్టుకు కా సిన ఫలాలను పరిశీలించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ.. ఇతర పండ్లతోటల కంటే ఆయిల్ ఫాం చాల ఉత్తమమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగూడ, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ జిల్లాలో మాత్రమే ఇది సాగవుతుందనీ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ పంట విస్తీర్ణం పెంచేయోచన ఉందని చెప్పారు. ఇక్కడ కేంద్రే బాలాజీ సేంద్రీ య ఎరువులతో ఆపిల్‌తో పాటు ఇతర పండ్లతోటను సాగుచేయడం అభినందనీయమన్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటలకంటే ఈ పండ్లకు మార్కెట్లో అధిక ధర పలుకుతుందని చెప్పారు. అందుకు ఆర్గానిక్ ధ్రువపత్రం తీసుకుంటే ఎక్కడైన పండ్లను విక్రయించవచ్చని సూచించారు.

అదే మాదిరిగా ఆయిల్ ఫాం సైతం సాగుచేస్తే ఆర్థికంగా ఎదిగే ఆస్కారం ఉందన్నారు. ఈ విషయంమై ముందుగా పంటసాగుకు భూమి అనుకూలంగా ఉందా లేదా అనేది తేల్చాల్సి ఉందన్నా రు. త్వరలోనే భూ నమూనాలను సేకరించి పరీక్ష ల ద్వారా సాధ్యమని తేలితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కాగజ్‌నగర్‌లో 315 మొక్కలు సాగవుతున్నాయని ఇక్క డి వాతవరణం అనుకూలంగా మారితే 2వేల ఎకరాలో సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామ ని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జి ల్లా అధికారి మెహర్‌బాషా, క్లస్టర్ అధికారి నదీం, కెరమెరి, కాగజ్‌నగర్ హెచ్‌ఈవోలు రమేశ్, శాంతిప్రియ, రైతు కేంద్రే బాలాజీ ఉన్నారు.

జంబుగ ప్లాంటేషన్ పరిశీలన..
కాగజ్‌నగర్ రూరల్ : మండలంలోని జంబుగ ప్లాం టేషన్‌ను బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండి యా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌ఫాం రీసెర్చ్ అధికారి డాక్టర్ ఎం.వీ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి రాజశేఖర్ రెడ్డి బృందం ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఐదెకరాల్లో ఆయిల్ ప్లాంటేషన్‌లోని చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటలకు అధిక ప్రాధా న్యం ఇస్తుందనీ, రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా ఇతర రకాల పంటలపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. ఇందులో భాగంగా జంబుగలోని ఆయిల్ ప్లాంటేషన్‌ను పరిశీలించామన్నారు. ప్లాంటేషన్ 1998లో వేశారని అప్పుడు కొంత ఆయిల్ తీశారని, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, నిర్వహణ లోపంతో నిలిచిపోయాయని, త్వరలోనే ప్లాంటేషన్ పునఃరుద్ధరణ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీరి వెంట జిల్లా హర్టికల్చర్, సెరికల్చర్ అధికారి మెహర్ బాషా, కాగజ్‌నగర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి ఏజే శాంతి ప్రియదర్శిని, హెచ్‌ఈవో పీ వనోజరెడ్డి ఉన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles