మెరుగైన సేవలందించాలి

Thu,April 18, 2019 12:01 AM

తిర్యాణి : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల పరిశీలన అధికారి అశోక్ కుమార్ సూచించారు. మంగళవారం గిన్నేదరి, రోంపల్లి పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించి క్వాలిటీ అస్యూరెన్స్ పథకం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయన్నారు. వైద్య సిబ్బంది ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సేవలు అందిస్తున్నారో తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోనే రోంపల్లి పీహెచ్‌సీ పరిశుభ్రత పాటించడంతో కాయాకల్పా పథకం కింద ఎంపికయ్యిందని గుర్తుచేశారు. దీంతో ప్రోత్సాహాక బహుమతి కింద రూ. 2 లక్షలను కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారన్నారు. ఇందులో భాగంగానే క్వాలిటీ అస్యూరెన్స్ అనే మరో పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని కింద ప్రసూతి గది, అడ్మినిస్ట్రేషన్, ఇన్‌పేషేంట్, ఔట్ పేషెంట్, వార్డ్, లేబోరేటరీ, నేషనల్ హెల్త్ ప్రోగ్రాం కండక్ట్, ఆయా విభాగాల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో పరిశీలించామన్నారు.

కాగా ఇటీవల జిల్లా అధికారులు సైతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆయా ప్రాథమిక వైద్యశాలలను పరిశీలించారనీ, వారిచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట ప్రభుత్వం తరుపున తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. నివేదికలను కేంద్ర నాణ్యతా ప్రమాణాల తనిఖీ అధికార బృందానికి పంపుతామన్నారు. తర్వాత వారు పర్యటించి సంతృప్తి చెందితే రూ. 2 లక్షల బహుమతి అందిస్తారని చెప్పారు. సమావేశాల్లో జిల్లా నాణ్యతా ప్రమాణాల అధికారి ధరంసింగ్, అడిషనల్ డీఎంఆండ్ హెచ్‌వో సుధాకర్ నాయక్, గిన్నేదరి, రోంపల్లి వైద్యాధికారులు శ్యాం, మురళీధర్,డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ హెల్త్ ఎడ్యుకేటర్ రసీద్‌ఖాన్, రోంపల్లి హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ మార్క శంకర్‌గౌడ్, ఫార్మాసిస్టులు వేణు, అంజయ్య, ఆయా వైద్యశాలల సిబ్బంది ఉన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles